ఇసుక పాలసీలో అవకతవకలపై కేసు: ఏపీ హైకోర్టులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్

By narsimha lodeFirst Published Nov 7, 2023, 2:19 PM IST
Highlights

వరుస కేసులతో  చంద్రబాబు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు పలు కేసులు ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసింది. 
 

అమరావతి:ఇసుక పాలసీలో  నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారంనాడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో  ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి   ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  ఈ నెల  2వ తేదీన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబునాయుడు  ముందస్తు బెయిల్ కోరుతూ  ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇసుక పాలసీపై  నమోదైన కేసులో ఏ 2గా చంద్రబాబు పేరును సీఐడీ చేర్చింది.   ఈ కేసులో  పీతల సుజాత,  చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమమహేశ్వరరావుల పేర్లున్నాయి.

ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీఎండీసీ  ఎండీ సీఐడీకి  ఫిర్యాదు చేసింది.నిబంధనలకు విరుద్దంగా  కంపెనీలకు అనుమతులు ఇచ్చారని  సీఐడీకి మైనింగ్ సంస్థ  ఆరోపణలు చేసింది.  ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9న  అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల  28 వ తేదీ వరకు  చంద్రబాబుకు  ఈ కేసులో మధ్యంతర బెయిల్ ను  ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.  అనారోగ్య కారణాలతో  చంద్రబాబుకు  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 

also read:చంద్రబాబుపై 15 రోజులకో కేసు: గవర్నర్‌తో లోకేష్ నేతృత్వంలో టీడీపీ బృందం భేటీ

ఇసుక పాలసీ విషయంలో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ లో  ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు  ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు,  అంగళ్లు కేసు,ఇసుక పాలసీ, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి విషయమై  చంద్రబాబుపై ఏపీ సర్కార్  కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

click me!