ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్ధి నారా లోకేష్: కేశినేని నాని ఫైర్

By narsimha lode  |  First Published Jan 10, 2024, 5:29 PM IST


తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై  విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు.


విజయవాడ: ఆఫ్ట్రాల్  ఓటమి పాలైన  ఎమ్మెల్యే అభ్యర్ధి నారా లోకేష్ అని  విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. బుధవారం నాడు  తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కేశినేని నాని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు , లోకేష్ పై  నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. 

 ఏ హక్కు ఉందని లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించాడని  కేశినేని నాని ప్రశ్నించాడు.  చంద్రబాబు కొడుకుగా  తప్ప లోకేష్ కు ఉన్న అర్హత ఏమిటని ఆయన  అడిగారు.  ఆఫ్ట్రాల్  ఓడిపోయిన ఎమ్మెల్యే అంటూ  లోకేష్ పై  కేశినేని నాని మండిపడ్డారు. పార్టీ ఇచ్చిన అన్ని వనరులను వినియోగించుకున్నా కూడ  లోకేష్ మంగళగిరిలో  ఓటమి పాలయ్యాడన్నారు.  కానీ,  పార్టీ నుండి ఎలాంటిది ఆశించకుండానే  తాను  రెండు దఫాలు విజయవాడ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించినట్టుగా కేశినేని నాని  చెప్పారు.  ఆఫ్ట్రాల్ ఓడిపోయిన  ఎమ్మెల్యే అభ్యర్ధి లోకేష్ చేసే పాదయాత్రకు  ఎందుకు హాజరు కావాలని  కేశినేని నాని ప్రశ్నించారు.   పార్టీ సీనియర్లకు  లోకేష్ ఇచ్చే  విలువ ఇదేనా అని ఆయన అడిగారు. 

Latest Videos

undefined

కుటుంబంలో చిచ్చుపెట్టి కుటుంబ సభ్యులతోనే తనపై దాడి చేయించే ప్రయత్నం చేశారని కేశినేని నాని విమర్శించారు.  తన కుటుంబ సభ్యులతోనే తనపై  లోకేష్ దాడి చేయించారని  నాని  చెప్పారు.

also read:వైఎస్ఆర్‌సీపీకి గుడ్‌బై: రాజీనామా చేసిన కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్

విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఈ నెల  4వ తేదీన  తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా  ఆయన  తన రాజీనామా విషయాన్ని తెలిపారు.  విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. విజయవాడ ఎంపీ పదవికి  రాజీనామా ఆమోదం పొందిన తర్వాత  కేశినేని నాని వైఎస్ఆర్‌సీపీలో చేరనున్నారు. 

also read:తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట: మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి కేశినేని నాని  తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు.  2019లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించిన తర్వాత  కేశినేని నానికి పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. 

 


 

click me!