వైఎస్ఆర్‌సీపీకి గుడ్‌బై: రాజీనామా చేసిన కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్

By narsimha lodeFirst Published Jan 10, 2024, 4:21 PM IST
Highlights


కర్నూల్  జిల్లాకు చెందిన వైఎస్ఆర్‌సీపీ నేత సంజీవ్ కుమార్  ఆ పార్టీకి రాజీనామా చేశారు.

కర్నూల్: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)కి  కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్  బుధవారంనాడు రాజీనామా చేశారు.  కర్నూల్ ఎంపీ పదవికి కూడ ఆయన రాజీనామా చేశారు.  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రకటించారు.కర్నూల్ ఎంపీగా గుమ్మనూరు జయరాం ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది.  దీంతో  అసంతృప్తికి గురైన  సంజీవ్ కుమార్  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.

also read:చంద్రబాబు మోసగాడు, టీడీపీని ఖాళీ చేస్తా:కేశినేని నాని సీరియస్ కామెంట్స్

గత ఎన్నికల సమయంలో డాక్టర్ సంజీవ్ కుమార్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే  సంజీవ్ కుమార్ కర్నూల్ ఎంపీగా  విజయం సాధించారు. 2014 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో  గెలుపు గుర్రాలకే  టిక్కెట్లు కేటాయించాలని  వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే సిట్టింగ్  ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు.ఈ క్రమంలోనే కర్నూల్ ఎంపీ  సంజీవ్ కుమార్ స్థానంలో  గుమ్మనూరు జయరాం ను బరిలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు.

also read:ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్ధి నారా లోకేష్: కేశినేని నాని ఫైర్

ఈ విషయమై  పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు  తాను  గతనాలుగైదు రోజులుగా ప్రయత్నాలు చేసినా కూడ ఆ ప్రయత్నాలు ఫలించలేదని  డాక్టర్ సంజీవ్ కుమా బుధవారం నాడు మీడియాకు చెప్పారు. ఈ విషయమై  తాను  పార్టీ పెద్దలకు  ఫోన్లు, మేసేజ్ లు కూడ చేసినట్టుగా చెప్పారు. పార్టీ అధిష్టానంనుండి సానుకూల స్పందన రాలేదన్నారు. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. 

తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజకీయాల్లో  ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో  ఉన్నట్టుగా  సంజీవ్ కుమార్ చెప్పారు. వచ్చే పది నుండి 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నట్టుగా చెప్పారు. గతంలో  తాను బీసీ  ఉద్యమాల్లో  పనిచేసిన సమయంలో  తనను గుర్తించి టిక్కెట్టు ఇచ్చిన జగన్ కు  ధన్యవాదాలు తెలిపారు.  

also read:తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట: మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

కర్నూల్ ఎంపీగా సంజీవ్ కుమార్ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే  విషయమై  ప్రస్తుతం చర్చకు దారితీసింది.  సంజీవ్ కుమార్  రాజకీయాల్లో కొనసాగుతానని కూడ ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో  టిక్కట్లు దక్కని నేతలు  ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీలల్లోని నేతలు అటు నుండి ఇటు నుండి అటు వలసలు వెళ్తున్నారు. 

 

click me!