చంద్రబాబు లగ్జరీ చూసి ప్రధానే ఆశ్చర్యపోయేవారు... తమతో ఇలాగనేవారు..: కేశినేని నాని

By Arun Kumar P  |  First Published Feb 13, 2024, 10:10 AM IST

లగ్జరీ బుల్లెట్ ఫ్రూఫ్ కారెక్కి ఇంటిముందున్న హెలిప్యాడ్ కు... అక్కడ హెలికాప్టర్ ఎక్కి గన్నవరం విమానాశ్రయానికి... అక్కడినుండి ప్రత్యేక విమానంలో డిల్లీకి చేరుకుని.... తమది పేద రాష్ట్రం అని చంద్రబాబు ప్రధానితో చెప్పేవారట చంద్రబాబు. అప్పుడు ప్రధాని తమతో ఇలా అనేవారంటూ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేాసారు. 


విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారింది మొదలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విమర్శిస్తూనే వున్నారు. తాజాగా మరోసారి మాజీ బాస్ వ్యవహారతీరుపై సెటైర్లు వేసారు. చంద్రబాబు లగ్జరీ చూసి ఆంధ్ర ప్రదేశ్ పేద రాష్ట్రమంటే ప్రధాని నరేంద్ర మోదీ నమ్మేవారు కాదన్నారు. చంద్రబాబు కలిసినప్పుడల్లా ప్రధాని తమతో ఇలా అనేవారంటూ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

''ఇంటిముందున్న హెలిప్యాడ్ వరకు వెళ్ళేందుకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కుతాడు ... గన్నవరం విమానాశ్రయానికి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ వాడతాడు. ప్రత్యేక విమానంలో దేశ రాజధాని డిల్లీ వెళతాడు. ఇంత లగ్జరీగా వుండే చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమది పేద రాష్ట్రమని చెప్పేవాడు. ఇతడి వ్యవహార తీరుకు, మాటలకు పొంతన లేకపోవడంతో ప్రధాని నమ్మేవాడు కాదు'' అంటూ చంద్రబాబుపై నాని సెటైర్లు వేసారు. 

Latest Videos

టిడిపి అధికారంలో వుండగా చంద్రబాబు చాలాసార్లు ప్రధానిని కలిసారని... ఆయనతో పాటు తాముకూడా వెళ్లేవారమని నాని అన్నారు. చంద్రబాబు కలిసి వెళ్లిపోయాక ప్రధాని తమతో ఇలా అనేవారంటూ నాని ఆసక్తికర కామెంట్స్ చేసారు. ''ఈయన పేద రాష్ట్రానికి సీఎంలా వున్నాడా..? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అత్యంత సామాన్యురాలిగా రబ్బరు చెప్పులు వేసుకుని, 100 రూపాయలు చీర కట్టుకుని, చిన్న కారులో తిరుగుతుంది మమతా బెనర్జీ. కాబట్టి పశ్చిమ బెంగాల్ పేద రాష్ట్రమంటే నమ్మేలా వుంటుంది. కానీ మీ ముఖ్యమంత్రిని చూసాక ఆంధ్ర ప్రదేశ్ పేద రాష్ట్రమంటే ఎలా నమ్ముతాం?'' అని ప్రధాని అనేవారని నాని తెలిపారు. 

Also Read  జనసేనలో సినిమావాళ్ళదే హవా... ఆ నిర్మాత, కొరియోగ్రాఫర్ కు పవన్ కీలక బాధ్యతలు

ఇలా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా... ప్రచార ఆర్భాటం చేస్తుంటారని ఎంపీ నాని అన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేసినా నిజాయితీగా చేస్తారన్నారు. చంద్రబాబుదంతా హైప్ అయితే జగన్ ది మాత్రం రియాలిటీ అని కేశినేని నాని అన్నారు. 

ఇదిలావుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేస్తున్న కేశినేని నానికి సొంత తమ్ముడు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. నందిగామలో ఇద్దరు సైకోలు (వైసిపి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మొండితోక జగన్మోహనరావు) చాలదన్నట్లు మరో సైకో (కేశినేని నాని) బయలుదేరాడని మండిపడ్డారు. కాబట్టి ఈ సైకోల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని... టిడిపి నుండి పోటీచేసే తంగిరాల సౌమ్యను గెలిపించుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు కేశినేని చిన్ని.  
 
త్వరలో జరగనున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి గెలుపు ఖాయమని... ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  మొత్తం 175 స్థానాలకు గాను జనసేన, టిడిపి 160 స్థానాల్లో గెలవబోతున్నాయని ధీమా వ్యక్తం చేసారు. చివరకు వైసిపి అధినేత, సీఎం వైఎస్ జగన్ ను కూడా పులివెందులలో ఓడిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది... ఈ రాక్షస పాలన సాగనంపేందుకు సిద్దం కావాలని కేశినేని చిన్ని అన్నారు.
 

click me!