Adudam Andhra: వైజాగ్ లో 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకలు.. పాల్గొననున్న సీఎం జగన్‌..

By Rajesh Karampoori  |  First Published Feb 13, 2024, 3:16 AM IST

Adudam Andhra: ఏపీలో దాదాపు 50 రోజుల పాటు నిర్వహించిన క్రీడా టోర్నీ ఆడుదాం ఆంధ్రా నేటీతో ముగియనుంది. విశాఖపట్నంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. 


Adudam Andhra: ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది లేదు. క్రీడారంగంలో ప్రోత్సాహం లేక మరుగున పడ్డ ప్లేయర్లు ఎంతోమంది. అలాంటి మరుగునపడ్డ మాణిక్యాలేందరో.. అలాంటి వారిని వెలికి తీయాలనే ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ప్రోత్సాహం అందిస్తోంది.  అద్భుతమైన ప్లేయర్లను సిద్ధం చేసే దిశగా ఓ మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేసింది.

గ్రామీణ స్థాయిలో అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఓ  ఈవెంట్ ప్రారంభించింది. అదే.. ఆడుదాం ఆంధ్రా క్రీడా టోర్నీ .. సుమారు 50 రోజుల పాటు సాగిన క్రీడా టోర్నీ నేటీ(మంగళవారం)తో ముగిస్తోంది.  నేడు విశాఖపట్నంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.ఈ టోర్నీలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అంచనా. 
 
గ్రామ స్థాయి పోటీల నుండి రాష్ట్ర స్దాయి వరకు క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు.  రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి.  ఇందులో దాదాపు 3 లక్షల మ్యాచ్‌లు జరిగాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం, చెన్నై సూపర్ కింగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబడ్డీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వంటి ప్రఖ్యాత ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కుర్చుకుంది.

Latest Videos

ఔత్సాహిక ఆటగాళ్లను గుర్తించడం, ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర క్రీడారంగంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా  ఈ టోర్నీ నిలవబోతుంది. గత డిసెంబర్ 26న జగన్ ప్రారంభించిన ఈ టోర్నీని నేటీతో ముగియబోతుంది
 

click me!