విజయవాడ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 05, 2024, 03:37 PM ISTUpdated : Mar 07, 2024, 05:05 PM IST
విజయవాడ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజవకవర్గాల్లో విజయవాడ ఒకటి. రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ వంటి ఈ నగరంలో రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే . విజయవాడ మీద పట్టు నిలుపుకుంటే రాజకీయంగా ఓ మెట్టుపైన వుండొచ్చని పార్టీలన్నీ భావిస్తాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రానికి, దేశానికి ఉద్ధండులైన నేతలను విజయవాడ నగరం అందించింది. ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంట్‌కు 17 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 11 సార్లు , టీడీపీ ఐదు సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి విజయం సాధించారు. మ్మ సామాజికవర్గ జనాభా ఎక్కువగా వుండటంతో ఈ వర్గానికి చెందిన వారే ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలుస్తున్నారు. 

ఉమ్మడి మద్రాస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , ప్రస్తుత నవ్యాంధ్రలో రాజకీయాలకు విజయవాడ ఓ పెద్ద అడ్డా. పొలిటికల్ సెంటర్‌గా నాడు నేడు తెలుగు రాజకీయాలను ఈ నగరం ప్రభావితం చేసింది. విజయవాడ మీద పట్టు నిలుపుకుంటే రాజకీయంగా ఓ మెట్టుపైన వుండొచ్చని పార్టీలన్నీ భావిస్తాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రానికి, దేశానికి ఉద్ధండులైన నేతలను విజయవాడ నగరం అందించింది.

బెజవాడ నుంచి ఎంతోమంది నేతలు ఎదిగారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారోనని ఉత్కంఠ నెలకొంది. బెజవాడ ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహుల జాబితా భారీగా వుంది. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం చరిత్ర ఒకసారి పరిశీలిస్తే.

విజయవాడ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. మహిళా ఓటర్లదే పైచేయి :

విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయవాడ ఒకటి. దీని పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గాలున్నాయి. బెజవాడ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,52,662 మంది. వీరిలో ఎస్సీలు 3,02,437.. ఎస్టీలు 61,148.. రూరల్ ఓటర్లు 7,22,213..  అర్బన్ ఓటర్లు 9,30,449 మంది . అలాగే 7,65, 141 మంది మహిళా ఓటర్లు కాగా.. 7,49,116 మంది పురుష ఓటర్లు.

ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంట్‌కు 17 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 11 సార్లు , టీడీపీ ఐదు సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి విజయం సాధించారు. ఇప్పటి వరకు గెలిచిన వారిలో ఒక్క స్వతంత్ర అభ్యర్ధి మినహా మిగిలిన వారంతా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే . బెజవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కమ్మ సామాజికవర్గ జనాభా ఎక్కువగా వుండటంతో ఈ వర్గానికి చెందిన వారే ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలుస్తున్నారు. 

స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో (1952) విజయవాడ నుంచి పశ్చిమ బెంగాల్‌కు చెందిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ విజయం సాధించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సరోజిని నాయుడి తమ్ముడే హరీంద్రనాథ్. ఆ తర్వాత కేఎల్ రావు మూడుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 1977లో బెజవాడ నుంచి ఎన్నికైన గోడె మురహరి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించి సత్తా చాటారు. అనంతరం చెన్నుపాటి విద్య, పర్వతనేని ఉపేంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు, లగడపాటి రాజగోపాల్, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిలు ఇక్కడి నుంచి రెండేసి సార్లు ఎంపీగా విజయం సాధించారు. 

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ నుంచి రెండోసారి టికెట్ దక్కించుకున్న కేశినేని నానికి 5,73,929 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ నుంచి పొట్లూరి వి ప్రసాద్ (పీవీపీ) 5,66,772 ఓట్లు, జనసేన అభ్యర్ధి ముత్తంశెట్టి సుధాకర్ 81,650 ఓట్లు దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని 8,726 ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లోని ఆరు చోట్ల వైసీపీ విజయం సాధించినప్పటికీ.. లోక్‌సభ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.

విజయవాడ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024.. బరిలో ఎవరుండొచ్చు :

2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే.. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు, ఆ వెంటనే ఆయనకు పార్టీ ఎంపీ టికెట్ ప్రకటించింది. దీంతో కేశినేని ప్రచారంలో దూకుడు పెంచారు. తెలుగుదేశం విషయానికి వస్తే.. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని ఆ పార్టీ బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే టీడీపీ జనసేనలు పొత్తులో వుండటం.. బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో చివరి నిమిషం వరకు అభ్యర్ధి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం