వివేకా హత్యపై చర్చకు సిద్ధమా? అంటూ దేవినేని ఉమ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం జగన్‌కు ఉన్నదా? అని అడిగారు. బాబాయిది గుండెపోటు కాదు.. గొడ్డలిపోటు అని చివరికి బయటపడిందని, చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాడా? అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఆయన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై చర్చకు సిద్ధమా? చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం జగన్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని, దాన్ని గుండెపోటుగా మభ్యపెట్టాలని ప్రయత్నించినట్టు దేవినేని ఉమ అన్నారు. కానీ, చివరికి అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని బయటపడిందని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించి జగన్ గెలిచారని దేవినేని ఉమ ఆరోపించారు. బాబాయిని చంపిన గొడ్డలి ఎవరిచ్చారని ఆయన చెల్లెలే అడుగుతున్నదని పేర్కొన్నారు. ఇటీవలే వివేకా కూతురు డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఓటు వేయవద్దని కోరారు. తన తండ్రిని గొడ్డలితో చంపిన విషయం జగన్‌కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను పేర్కొంటూ తాజాగా దేవినేని ఉమ జగన్‌ను ప్రశ్నించారు.
Also Read: ఇండియా దేశం కాదు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదు: డీఎంకే ఎంపీ రాజా షాకింగ్ కామెంట్స్
ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని, ఆ తర్వాత ఆయన లండన్‌కు పారిపోతాడని దేవినేని ఉమ అన్నారు. ఇక తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని వివరించారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రావడంతో టికెట్ ఎవరికి దక్కుతుందా? అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.