సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు ... వీడియోలు వైరల్, ఇంటి దొంగల పనేనా..?

Siva Kodati |  
Published : Jan 03, 2023, 05:12 PM ISTUpdated : Jan 03, 2023, 07:29 PM IST
సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు ... వీడియోలు వైరల్, ఇంటి దొంగల పనేనా..?

సారాంశం

సోషల్ మీడియాలో బెజవాడ కనకదుర్గమ్మ అంతరాలయం వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తున్నారు ఈవో భ్రమరాంభ. 

సోషల్ మీడియాలో బెజవాడ కనకదుర్గమ్మ అంతరాలయం వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోని కనకదుర్గ టెంపుల్ ఐడీలో ఆలయ ఆవరణతో పాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది సహకారంతోనే వీడియోలు తీసినట్లుగా దుర్గగుడి అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తున్నారు ఈవో భ్రమరాంబ. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ..  శాంతకుమారి అనే భక్తురాలు వీడియోలు తీసినట్లుగా గుర్తించామన్నారు. దుర్గ గుడి వీడియోలను గత నెల 22న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారని ఈవో భ్రమరాంబ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శాంతకుమారిపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె వెల్లడించారు. అంతరాలయ సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు ఇచ్చామని భ్రమరాంబ తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం