సచివాలయం, వాలంటీర్లకు భవనాలు లేవు: మరోసారి మాజీ మంత్రి ఆనం సంచలనం

By narsimha lodeFirst Published Jan 3, 2023, 4:15 PM IST
Highlights

సచివాలయం, వాలంటీర్లకు  భవనాలు లేవని  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  ఆవేదన వ్యక్తం  చేశారు.  వరుసగా  మాజీ మంత్రి  ఆనం  రామనారాయణరెడ్డి  వ్యాఖ్యలు చేయడం  కలకలం రేపుతున్నాయి. 

నెల్లూరు: .సచివాలయం, వాలంటీర్లకు భవనాలు లేవని  మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డి  అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వరుసగా  మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డి   చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మంగళవారంనాడు  ఆనం నారాయణరెడ్డి  మరోసారి  ప్రభుత్వ తీరుపై తన  అసంతృప్తిని  ఆయన బయటపెట్టారు.సచివాలయ సిబ్బంది  ఎక్కడ కూర్చొని పనిచేయాలో అర్ధం కావడం లేదన్నారు. అద్దె భవనాలు, అంగన్ వాడీ కార్యాలయాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారని ఆయన చెప్పారు. నిధులు మంజూరు చేసినా  భవనాలు పూర్తి కాలేదన్నారు.

నాలుగేళ్లలో  ప్రజలకు ఏం చేశామని  ఆనం నారాయణ రెడ్డి ప్రశ్నించారు. పెన్షన్లు  ఓట్లు కురిపిస్తాయా అని ఆయన అడిగారు.  గత ప్రభుత్వం పనులు చేయలేదని విమర్శలు చేసి  అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  ప్రాజెక్టులు  ఏమైనా కట్టామా అని ఆయన అడిగారు.  గత ప్రభుత్వం కూడా పెన్సన్లు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఏమైందన్నారు.  పేదలకు  ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఎన్ని ఇళ్లు కట్టించామని  ఆనం ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్  26న  ఆనం రామనారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం నిధులిస్తేనే  నీళ్లిచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.  రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు.  ఈ వ్యాఖ్యలు చేసిన  మూడు రోజులకే  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  పార్టీ పరిశీలకుడి సమక్షంలోనే తాను ఎమ్మెల్యేనా కాదా అని  ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలకు కూడా ఇదే  అనుమానం ఉందని  ఆనం రామనారాయణరెడ్డి  చెప్పారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకే తాను  ఇలా మాట్లాడుతున్నట్టుగా ఆనం రామనారాయణరెడ్డి  గత ఏడాది డిసెంబర్ చివర్లో మీడియాకు చెప్పారు  కొత్త సంవత్సరంలో  కూడా  ఆనం రామనారాయణరెడ్డి అదే రకమైన వ్యాఖ్యలు చేశారు.

also read:నా పేరు విన్నా, నా ఫోటో చూసినా ఎందుకంత భయం : ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి కౌంటర్

తాను  పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారని  జరుగుతున్న ప్రచారాన్ని కూడా  ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు.  క్షేత్రస్థాయిలో  ఏం జరుగుతుందో  సీఎం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా  చెప్పారు.ఇదిలా ఉంటే  నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి  కూడా అధికారుల తీరుపై  తీవ్ర విమర్శలు చేశారు.  ఈ విషయమై  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని  ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న పిలిపించి  మాట్లాడారు. తన వ్యాఖ్యల గురించి  సీఎంకు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత అంశాల విషయమై  కూడా సీఎం జగన్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య  చర్చ జరిగింది.  


 

click me!