విజయారెడ్డి ఎఫెక్ట్ : ఏపీలోని తహాశీల్దార్ కార్యాలయంలో పెట్రల్ తో రైతు హల్ చల్

By Nagaraju penumalaFirst Published Nov 25, 2019, 3:56 PM IST
Highlights

పెట్రోల్ తో హల్ చల్ చేసిన వ్యక్తి మంగళగిరి మండలానికి చెందిన శివకోటేశ్వరరావు అనే రైతుగా గుర్తించారు. పట్టాదారు పాసుపుస్తకాల జారీలో రెవెన్యూ సిబ్బంది అలసత్వం వహిస్తున్నారంటూ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మంగళగిరి: మంగళగిరి తహాశీల్ధార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో ఓ వ్యక్తి హల్ చల్ చేశారు. సమస్యలకు పరిష్కారం చూపుతారా లేక పెట్రోల్ పోసుకుని చావమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతేకాదు పెట్రోల్ పోసుకోమంటారా లేక పోయాలా అంటూ కూడా అధికారులను హెచ్చరించారు. ఈ విషయాన్ని తహాశీల్దార్ కార్యాలయ సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ తో హల్ చల్ చేసిన వ్యక్తి మంగళగిరి మండలానికి చెందిన శివకోటేశ్వరరావు అనే రైతుగా గుర్తించారు. పట్టాదారు పాసుపుస్తకాల జారీలో రెవెన్యూ సిబ్బంది అలసత్వం వహిస్తున్నారంటూ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా తహాశీల్ధార్ పట్టాదారు పాస్ పుస్తకం కోసం తిరుగుతూనే ఉన్నానని అయినా అధఇకారుల్లో ఎలాంటి స్పందన లేదని తెలిపారు.  

శివకోటేశ్వరరావు అనే రైతు పెట్రోలో బాటిల్ తో తహాశీల్దార్ కార్యాలయానికి రావడంతో ఆ పరిసర ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎవరా అంటూ చూసేందుకు అధికారులు, ప్రజలు కూడా పోటెత్తిన పరిస్థితి నెలకొంది. 

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి తహాశీల్ధార్ లు ఆందోళనలో ఉంటున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. 

అబ్దుల్లాపూర్ మెట్ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని తహాశీల్ధార్లు భయంతోనే ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. ఈ ఘటన నేపథ్యంలో పలువురు తహాశీల్దార్లు పోలీసుల రక్షణ కోరగా మరికొందరు మాత్రం అర్జీదారులు తమ దగ్గరకు రాకుండా తాడులు కట్టుకుంటున్నారు. మరోకరు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరైతే లంచాలు తీసుకోము అంటూ పెద్దపెద్ద అక్షరాలతో బోర్డులను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఈ వార్తలు కూడా చదవండి

విజయారెడ్డి హత్యను గుర్తు చేసిన రైతులు... ఏపీలో కంటతడి పెట్టిన తహసీల్దార్

pattikonda mro: విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త...
 

click me!