విషాదాంతం: దీప్తిశ్రీని చంపి మూటకట్టి.. ఉప్పుటేరులో పడేసిన సవతి తల్లి

By sivanagaprasad KodatiFirst Published Nov 25, 2019, 3:14 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కథ విషాదాంతమైంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ఇంద్రపాలెం గేట్ల వద్ద చిన్నారి మృతదేహాన్ని ధర్మాడి సత్యం బృందం సోమవారం గుర్తించింది. మూడు రోజుల క్రితం పాఠశాల నుంచి దీప్తిశ్రీ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది.

ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీని సవతితల్లి హత్య చేసి చంపిందని నాయనమ్మ ఆరోపిస్తున్నారు.. దీప్తి కోసం ఉప్పుటేరు వాగులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. మృతదేహాన్ని ఉప్పేటేరు వాగులో వేసింది.

మృతదేహాన్ని వేసిన చోటును నిందితురాలు పోలీసులకు చూపింది. ఏడేళ్ల దీప్తిని తానే హతమార్చినట్టుగా శాంతికుమారి పోలీసుల విచారణలో ఒప్పుకొందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Also Read:కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కలకలం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుకొంటున్న ఏడేళ్ల దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి దారుణంగా హత మార్చింది. స్కూల్ నుండి శాంతికుమారి తీసుకెళ్లి ఆమెను హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సూరాడ సత్యశ్యామ్ కుమార్ మొదటి భార్య కూతురు దీప్తిశ్రీ.

అనారోగ్యంతో దీప్తిశ్రీ తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. దీంతో సత్యశ్యామ్ కుమార్ శాంతికుమారిని రెండో పెళ్లి చేసుకొన్నాడు. రెండో పెళ్లి చేసుకొన్న తర్వాత శాంతికుమారికి కొడుకు పుట్టాడు.

అయితే శాంతికుమారి చిన్నారి దీప్తిశ్రీని చిత్రహింసలకు గురి చేసేది. అయితే దీప్తిశ్రీ అంటే సత్యశ్యామ్ కుమార్ కు అమితమైన ప్రేమ. ఈ ప్రేమతో తనను, తన కొడుకును భర్త సత్యశ్యామ్ కుమార్ నిర్లక్ష్యం చేస్తున్నాడని శాంతికుమారి భావించింది.

Also Read:దారుణం:దీప్తిశ్రీని సవతి తల్లే చంపిందా?

దీప్తిశ్రీ ఆచూకీ విషయమై శాంతికుమారి పలు రకాల సమాధానాలు ఇచ్చింది. అయితే పోలీసులు ఐదుగురిని విచారించి వదిలేశారు. మరో వైపు శాంతికుమారి పోలీసుల విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగింది.

ఈ నెల 22న దీప్తిశ్రీ చదువుతున్న స్కూలుకు  వెళ్లిన  ఓ మహిళ దీప్తిశ్రీని స్కూల్ నుండి తీసుకొచ్చింది.అయితే దీప్తిశ్రీని ఓ మహిళ తీసుకెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ నుండి పోలీసులు సేకరించారు. ఆ దృశ్యాల్లో ఉంది శాంతికుమారేనని పోలీసులు గుర్తించారు.

click me!