
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి జిల్లాకు చెందిన వివాదం ఎట్టకేలకు ఓ కొలెక్కి వచ్చింది. విశాఖ నగర శివారు మధురవాడలోని సర్వేనెంబర్ 386/పీలో ఆమె విల్లాకు చెందిన ఖాళీ స్థలం ఉంది. ఎట్టకేలకు దీనికి ఖాళీ స్థలం పన్ను విధించారు. 576 గజాల స్థలానికి రెండేళ్ల వ్యవధి కోసం రూ.15,89,804 చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.
నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియాల్టర్స్ ఎల్ఎల్పి సంస్థకు చెందిన భవనం నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న సమయంలోనే జీవీఎంసీ అధికారులు నివాస ఆస్తి పన్ను విధించారు. సీబీసీఎన్ సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తర్న్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన నిర్మాణానికి జీవీఎంసీ వీఎల్టి విధింపుల్లో అవకతవకలు జరిగాయి.
వివాహేతర సంబంధం పెట్టుకున్నారని.. భర్త, ప్రియురాలికి అరగుండు కొట్టించి ఊరేగించిన భార్య..
దీనిమీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే జీవీఎంసీ అధికారులు స్పందించారు. అందులో భాగంగానే నేహా రెడ్డి భవనానికి విధించిన అసెస్మెంట్ ను వీఎల్టిగా మార్చారు. అదే విధంగా ఎంపీ ఎంపీపీ సత్యనారాయణ నిర్మాణానికి సంబంధించి రూ.90 లక్షలు చెల్లించాలని కూడా నోటీసులు జారీ చేశారు.
ఇలా పెనాల్టీల రూపంలో ఇప్పటివరకు 80 ఎకరాల నుంచి రూ. 60 కోట్లు రావాల్సి ఉంది. కాగా, విఎంఆర్డిఏ ఎండాడ సర్వేనెంబర్ 1/పి, మధురవాడలో సర్వేనెంబర్ 386/పిలో 80 ఎకరాలను గ్లోబల్ ఎంట్రో పోలీస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది. 2010లో విఎంఆర్డిఏ దీనికి సంబంధించి జీవీఎంసీ కి రూ.4 కోట్లు వీఎల్టీ చెల్లించింది.
ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు కేటాయించిన స్థలంలో ఇటీవలే భవన నిర్మాణం మొదలయ్యింది. నిజానికి చూసుకుంటే 2010 నుంచి 2023 వరకు అంటే 13 ఏళ్లకు బిఎల్టి విధించాల్సి ఉంది. కానీ, జీవీఎంసీ కేవలం ఒక్క ఏడాదికి మాత్రమే వీఎల్టి విధించింది. ఈ మొత్తం రూ. 7,94,902 మాత్రమే వీఎల్టి విధించింది.
దీంతో అధికార పార్టీ ఎంపీ కుమార్తె కావడంతోనే వీఎల్టీ ఒక ఏడాదికే విధించారని గుసగుసలు వినిపించాయి. మరోవైపు దాదాపు 80 ఎకరాలకు చెల్లించాల్సిన బకాయిలు లెక్కిస్తే రూ.60,09,24,800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీటికి కొత్తగా అసెస్మెంట్ చేసి మూడేళ్ల కాలానికి వీఎల్టి విధిస్తే రూ.16.77 కోట్ల మేర జీవీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది.
గ్లోబల్ ఎంట్రో పోలీస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన స్థలాల్లో ఇప్పటికే సగం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరికొన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయి. వీటన్నింటి నుండి కూడా జీవీఎంసీ వీఎల్టి వసూలు చేయగలిగితే భారీగా ఆదాయం సమకూర్తుందని సమాచారం.