విజయవాడలో దసరా ఉత్సవాలు... దుర్గమ్మ దర్శనానికి వారిని అనుమతించబోం: ఆలయ ఛైర్మన్

Arun Kumar P   | Asianet News
Published : Sep 18, 2020, 09:20 PM ISTUpdated : Sep 18, 2020, 09:27 PM IST
విజయవాడలో దసరా ఉత్సవాలు... దుర్గమ్మ దర్శనానికి వారిని అనుమతించబోం: ఆలయ ఛైర్మన్

సారాంశం

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులకు టైం స్లాట్ ప్రకారమే అనుమతివ్వనున్నట్లు ఆలయ ఛైర్మన్ వెల్లడించారు. 

విజయవాడ: దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందికి మాత్రమే అనుమతించనున్నట్లు విజయవాడ దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. రోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతివ్వనున్నామని... కేవలం మూల నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి  అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

ఉచిత దర్శనానికి 4వేల టికెట్లు, 100 రూపాయల టికెట్ కు 3 వేల టికెట్లు,  300 రూపాయలకు 3వేల టికెట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు దర్శనానికి అనుమతిచ్చేది లేదని అన్నారు.

read more  అంతర్వేది ఘటన ఆ మతాల కుట్రేనని అనుమానం: బిజెపి ప్రధాన కార్యదర్శి సంచలనం (వీడియో)

కోవిడ్ నేపద్యంలో తలనీలాలు సమర్పణ రద్దు చేసామన్నారు. వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్ మీదుగా క్యూ లైన్ ద్వారా భక్తులు రావాలని... ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దర్శనానికి రావాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu