మందుబాబులకు గుడ్‌న్యూస్: రేపటి నుంచి బార్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Sep 18, 2020, 8:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వున్న బార్ల లైసెన్స్‌లను కొనసాగిస్తూ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వున్న బార్ల లైసెన్స్‌లను కొనసాగిస్తూ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 840 లైసెన్స్‌లను కొనసాగించాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది.

2021 నుంచి జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను 10 శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది.

దీనితో పాటు రేపటి నుంచి బార్లు తెరుచుకునేందుకు సర్కార్ పచ్చజెండా ఊపింది. బార్ల లైసెన్స్‌పై 20 శాతం కోవిడ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 

click me!