బెజవాడ దుర్గమ్మ ఆలయంలో విజిలెన్స్ దాడులు

By Arun Kumar PFirst Published Mar 31, 2021, 1:52 PM IST
Highlights

సెక్యూరిటీ, శానిటరీ టెండర్లు అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు విజయవాడ కనకదుర్గ ఆలయంపై ఈ దాడులు చేపట్టారు.   

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ శానిటరీ టెండర్లు అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు ఈ దాడులు చేపట్టారు.   ఆలయ ఈవో సురేష్ బాబు నుండి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి జెమ్మి దొడ్డి కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి. స్టోర్స్, చీరల విభాగం, అన్నదాన విభాగంలో పలు ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. 

ఇక ఇప్పటికే బెజవాడ కనకదుర్గ ఆలయం అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రికార్డులతో పాటు ఏసీబీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దుర్గగుడిలో అక్రమాలకు, అవకతవకలకు ఈవో సురేష్ బాబు కారణమని ఏసీబీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు కనకదుర్గ గుడిలో సోదాలు నిర్వహించారు. అధికారులను, ఉద్యోగులను ప్రశ్నించారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణ జరిపారు. మూడు రోజుల పాటు తమ కసరత్తు సాగించిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరెలు సైతం మాయమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాము స్వాధీనం చేసుకున్న రికార్డులతో పాటు నివేదికను ప్రబుత్వానికి నివేదికను సమర్పిచారు. శానిటేషన్ టెండర్లలోనూ మాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్ లో కూడా లెక్కలు తేలలేదని ఏసీబీ అధికారులు చెప్పారు. 

అంతర్గత బదిలీలపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఏసీబీ అదికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తన పనిని పూర్తి చేశారు. తమకు ఫిర్యాదులు చేస్తే విచారణ జరుపుతామన ఏసీబి అధికారులు చెప్పారు.

click me!