పట్టపగలే ట్రైన్ దోపిడీ... మహిళా గార్డ్ ను బెదిరించి నగలు అపహరణ

Arun Kumar P   | Asianet News
Published : Mar 31, 2021, 01:31 PM IST
పట్టపగలే ట్రైన్ దోపిడీ... మహిళా గార్డ్ ను బెదిరించి నగలు అపహరణ

సారాంశం

సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటన తాడేపల్లి  కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది.  

విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్తున్న గూడ్స్ రైలు తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. ఈ సమయంలో రైలు వెనుక భాగంలో ఉన్న గార్డ్ పెట్టెలోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న మహిళా గార్డ్ ను బెదిరించారు. దీంతో బయపడిపోయాన ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలను తీసిచ్చింది. వీటిని తీసుకున్న దుండగులు రైలు కదలగానే పరారయ్యారు. 

ఈ దోపిడీపై తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ లో ఆర్పీఎఫ్ పోలీసులకు బాధిత రైల్వే గార్డు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ గా అనుమానిస్తున్నారు రైల్వే పోలీసులు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!