చంద్రబాబుపై ట్వీట్: సోము వీర్రాజుపై పనబాక లక్ష్మి ఎదురుదాడి

Published : Mar 31, 2021, 01:47 PM IST
చంద్రబాబుపై ట్వీట్: సోము వీర్రాజుపై పనబాక లక్ష్మి ఎదురుదాడి

సారాంశం

తాను చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు బిజెపి ఏపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ట్వీట్ మీద తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మండిపడ్డారు. సోము వీర్రాజు వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.

తిరుపతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై సోము వీర్రాజు చేసిన ట్వీట్ మీద పనబాక లక్ష్మి ఎదురుదాడికి దిగారు.  కాంగ్రెసులో ఉన్నప్పుడు ప్రస్తుత తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ఇటీవల ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబుపై పనబాక లక్ష్మీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న వీడియోను సోము వీర్రాజు ట్వీట్ చేశారు. దానిపై పనబాక లక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు. వీడియోను సోము వీర్రాజు మార్ఫింగ్ చేశారని ఆమె అన్నారు. తను ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదని ఆమె స్పష్టం చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో తెలియదా అని పనబాక లక్ష్మి అన్నట్లు ఓ వీడియోను సోము వీర్రాజు ట్వీట్ చేశారు నాడు... బాబు గురించి నేటి టీడీపీ తిరుపతి లోకసభ అభ్యర్థి లక్ష్మిగారి మాటల్లో.. అని వ్యాఖ్యానిస్తూ సోము వీర్రాజు వీడియోను ట్వీట్ చేశారు. 

కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి పనబాక లక్ష్మి టీడీపిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె టీడీపీ తరఫున తిరుపతి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున గురుమూర్తి, కాంగ్రెసు తరఫున చింతా మోహన్ పోటీ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu