ఎంవీవీఎస్‌ మూర్తికి వెంకయ్య నివాళులు.. మంచి మిత్రుడిని కోల్పోయా: ఉపరాష్ట్రపతి

By sivanagaprasad kodatiFirst Published Oct 7, 2018, 2:35 PM IST
Highlights

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళుర్పించారు. 

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళుర్పించారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న వెంకయ్య సిరిపురంలోని మూర్తి నివాసంలో ఆయన పార్థీవ దేహానికి శ్రద్థాంజలి ఘటించి.. కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. మూర్తి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని.. తనకు ఆయనతో మూడు దశాబ్ధాలకు పైగా అనుబంధం ఉందన్నారు.

మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీని స్థాపించి దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంవీవీఎస్ మూర్తి ఆశయాలను  కొనసాగించాల్సిన బాధ్యత ఆయన కుటుంబసభ్యులపై ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.

అమెరికాలో ప్రఖ్యాత వైల్డ్‌లైఫ్ సఫారీని చూసేందుకు లాస్ ఏంజెల్స్ నుంచి మూర్తితో పాటు మరో నలుగురు కారులో బయలుదేరారు. అలస్కా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తి, వీబీఆర్ చౌదరి, వెలవోలు బసవపున్నయ్య, శివప్రసాద్ దుర్మరణం పాలవ్వగా.. కడియాల వెంకట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం.. మూర్తి నివాసం వద్ద విషాదఛాయలు

మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఏర్పాట్లను సమీక్షిస్తున్న తానా

మూర్తిగారిని మొన్ననే మండలి సమావేశాల్లో చూశా.. ఇంతలోనే: నారా లోకేశ్

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

click me!