ఎంవీవీఎస్‌ మూర్తి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

By sivanagaprasad kodatiFirst Published Oct 7, 2018, 1:23 PM IST
Highlights

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

అమరావతి నుంచి విశాఖ సిరిపురంలోని మూర్తి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో మూర్తి అంత్యక్రియలు నిర్వహించాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. అంతకు ముందు అమెరికాలో ప్రభుత్వపరమైన అనుమతులు తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎయిర్ ఇండియా విమానం ద్వారా మూర్తి భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది..

అక్కడి నుంచి మరో విమానంలో విశాఖకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం సిరిపురంలోని ఆయన స్వగృహాంలో ఉంచి ... అక్కడి నుంచి రామ్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయానికి తరలిస్తారు.. అనంతరం రుషికొండకు అంతిమయాత్ర నిర్వహించి.. గీతం యూనివర్సిటీ వెనుక ఉన్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

అమెరికాలో ప్రఖ్యాత వైల్డ్‌లైఫ్ సఫారీని చూసేందుకు లాస్ ఏంజెల్స్ నుంచి మూర్తితో పాటు మరో నలుగురు కారులో బయలుదేరారు. అలస్కా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తి, వీబీఆర్ చౌదరి, వెలవోలు బసవపున్నయ్య, శివప్రసాద్ దుర్మరణం పాలవ్వగా.. కడియాల వెంకట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  
 

విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం.. మూర్తి నివాసం వద్ద విషాదఛాయలు

మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఏర్పాట్లను సమీక్షిస్తున్న తానా

మూర్తిగారిని మొన్ననే మండలి సమావేశాల్లో చూశా.. ఇంతలోనే: నారా లోకేశ్

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

click me!