ఇంగ్లీష్ నేర్చుకున్నా.. మాతృభాష మరవొద్దు.. జగన్ ప్రవేశపెట్టిన ఇగ్లీష్ మీడియంపై వెంకయ్యనాయుడు సెటైర్లు..

Published : Feb 14, 2023, 09:52 AM IST
ఇంగ్లీష్ నేర్చుకున్నా.. మాతృభాష మరవొద్దు.. జగన్ ప్రవేశపెట్టిన ఇగ్లీష్ మీడియంపై వెంకయ్యనాయుడు సెటైర్లు..

సారాంశం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మీద ఇండైరెక్ట్ గా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైటైర్లు వేశారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెటైర్ల వర్షం కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇది 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. ఆ ఏడు ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఆ తర్వాతి యేడు 2021- 22 నుంచి పదో తరగతి వరకు దశలవారీగా పెంచుకుంటూ పోతుంది.

దీని మీద మొదట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాగా, క్రమంగా ఈ పరిస్థితులన్నీ సర్దుమణిగాయి. అయితే, తాజాగా ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీని మీద స్పందించారు. సెటైర్ల వర్షం కురిపించారు. మాతృభాష గురించి, ఆంగ్ల భాష గురించి తనదైన శైలిలో మాట్లాడారు.

‘ప్రతి ఒక్కరూ మాతృభాష తప్పకుండా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ  మాతృభాషను మర్చిపో కూడదు. తల్లిదండ్రులు పిల్లలకు మాతృభాషను నేర్పించాలి. విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్డు ఉంది. దాన్ని ఎంజి రోడ్ అని పిలుస్తారు. అది మన దౌర్భాగ్యం.  ఎంజీ రోడ్డును మహాత్మా గాంధీ రోడ్డు అనే పిలిస్తే బాగుంటుంది. మన పూర్వీకులు ఆలయాలు ధర్మ రక్షణ కోసం, మానసిక ప్రశాంతత కోసం నిర్మించారు. దేవాలయాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పిస్తాయి. 

శ్రీకాకుళం జిల్లాలో విషాదం: పెళ్లైన మూడు రోజులకే నవదంపతులు మృతి

వెలుతురుని సూర్యుడిని సరిగ్గా వినియోగించుకున్నన్నాళ్లు మనం మంచి ఆరోగ్యంతో ఉంటాం. రాత్రి త్వరగా పడుకోవడం.. సూర్యోదయం ముందే లేవడం.. మంచి అలవాట్లు. సెల్ ఫోన్ ను అతిగా వాడితే..  అది హెల్ ఫోన్ గా మారుతుంది. మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’  అంటూ మాట్లాడారు. 

కరోనా గురించి కూడా వెంకయ్య నాయుడు మాట్లాడారు.. ‘ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కరోనా ఎక్కువగా రాలేదు. దీనికి కారణం వారు..  నిత్యం వెలుతురులో..  గాలి వెలుతురు సూర్యరశ్మికి దగ్గరగా ఉండటమే. చెట్లను,  నీటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి.  ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా రాలేదని ఎనభై శాతం పట్టణ ప్రాంతాల వారికి కరోనా వచ్చిందని అన్నారు.  దేవుడు ప్రసాదించిన సూర్యరశ్మిని ప్రతి ఒక్కరూ సరిగ్గా వినియోగించుకోవాలి అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారు. 

విజయమ్మను ఓడించేందుకు వైఎస్ వివేకా యత్నించారు: కొడాలి నాని పంచలనం

ప్రజలు ఆదాయాన్నిపెంచుకోవాలి.  దాన్ని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మనమంత్రాల్లోని అర్ధాన్ని తెలుగులో భక్తులకు విడమరచి అర్థమయ్యేలా చెప్పాలని నేను పురోహితులకు కూడా చెబుతున్నాను’  అంటూ చెప్పారు. ప్రస్తుతం వెంకయ్యనాయుడు తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని చెబుతున్నారు. కానీ తాజాగా ఇంగ్లీష్ మీడియం మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. ఏపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!