రాష్ట్రంలో జరిగే ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు.
అమరావతి:2024 ఎన్నికల్లో జగన్ అంటే ఏమిటో చంద్రబాబు మరోసారి చూస్తారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు.సోమవారం నాడు రాత్రి తాడేపల్లిలో మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రచురించిన జగనాసుర రక్త చరిత్ర ఎవరు చదువుతారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా సోషల్ మీడియా యుగమని ఆయన చెప్పారు.
వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన పార్టీలో వైఎస్ వివేకానందరెడ్డి చేరారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. . పులివెందులలో వైఎస్ విజయమ్మను ఓడించేందుకు వైఎస్ వివేకానందరెడ్డి ప్రయత్నించారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డితో జగన్ కు ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. జగన్ కు ఏమైనా పదవులు వచ్చాయా అని ఆయన అడిగారు . వివేకానందరెడ్డి మృతి చెందిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నందున సీబీఐ విచారణ కోరినట్టుగా కొడాలి నాని చెప్పారు.
undefined
వివేకానందరెడ్డి మరణిస్తే జగన్ కు ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. విజయమ్మ, వైఎస్ జగన్ విజయం కోసం వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు పని చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి బతికి ఉన్నా కడప ఎంపీ సీటు వైఎస్ అవినాష్ రెడ్డికే జగన్ ఇచ్చేవాడని కొడాలి నాని చప్పారు. వైఎస్ వివేకాందనరెడ్డి మరణించేనాటికి ఆయన ఆస్తుులన్నీ ఎవరి పేరు మీదకి బదిలీ అయ్యాయని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
మార్చి 18 నుండి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా మాజీ మంత్చెరి నాని ప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితి లో గెలవాలని సీఎం జగన్ చెప్పారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలని సీఎం దిశా నిర్దేశం చేశారన్నారు. ఈ ఎన్నికలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సీఎం చెప్పారని కొడాలి నాని తెలిపారు.
also read:చేసిన లబ్ది ప్రతి గడపకు చేరవేయాలి: ప్రజా ప్రతినిధులతో సీఎం జగన్
కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడప పై దృష్టి పెట్టాలని చెప్పారని మాజీ మంత్రి చెప్పారు. ప్రతి కార్యకర్త ఎన్నికలపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారన్నారు. రాష్ట్రంలో 175 సీట్లు గెలవడానికి అవకాశం ఉందని సీఎం చెప్పారన్నారు. లోకేష్ కు తాత గొంతు రావడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఖర్జూరనాయుడు గొంతు వచ్చి ఉంటుందని కొడాలి నాని ఎద్దేవా చేశారు.