శ్రీకాకుళం జిల్లాలో విషాదం: పెళ్లైన మూడు రోజులకే నవదంపతులు మృతి

Published : Feb 14, 2023, 09:28 AM IST
 శ్రీకాకుళం జిల్లాలో విషాదం: పెళ్లైన మూడు రోజులకే  నవదంపతులు మృతి

సారాంశం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  విషాదం  నెలకొంది. పెళ్లైన మూడు రోజులకే నవదంపతులు మృతి చెందారు.   


శ్రీకాకుళం : పెళ్లైన మూడు రోజులకే  నవదంపతులు  సోమవారం నాడు మృతి చెందారు.  ఈ ఘటన  శ్రీకాళుళం  జిల్లాలోని ఇచ్ఛాపురంలో  విషాదాన్ని నింపింది .శ్రీకాకుళం  జిల్లాలోని ఇచ్చాపురం గ్రామానికి  చెందిన వేణుకు  ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన  సుభద్రతో  ఈ నెల  10వ తేదీన  విశాఖపట్టణంలోని  సింహచలంలో  జరిగింది.  వివాహం  తర్వాత  నవదంపతులు  ఇచ్చాపురంలో  ఉన్నారు.

సంద్రదాయం ప్రకారంగా  నవదంపతులు   ఒడిశాలోని  బ్రహ్మపురకు బైక్ పై  సోమవారం నాడు బయలుదేరారు బైక్ పై వెళ్తున్న సమయంలో  వేణు దంపతులు  ప్రయాణీస్తున్న  బైక్ ను  ట్రాక్టర్ ఢీకొట్టింది.  దీంతో   సుభద్ర అక్కడికక్కడే మరణించింది.  బ్రహ్మపుర ఆసుపత్రికి  వేణును తరలిస్తున్న సమయంలో  అతను  మృతి చెందారు. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాల కు చెందిన  సభ్యులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు