పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిన వంగవీటి రాధాకృష్ణ!.. అమ్మాయి ఎవరంటే..

Published : Aug 16, 2023, 11:35 AM ISTUpdated : Aug 16, 2023, 12:04 PM IST
పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిన వంగవీటి రాధాకృష్ణ!.. అమ్మాయి ఎవరంటే..

సారాంశం

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సెప్టెంబర్‌లో వంగవీటి  రాధాకృష్ణ వివాహం జరగనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సెప్టెంబర్‌లో వంగవీటి  రాధాకృష్ణ వివాహం జరగనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నర్సాపురానికి చెందిన యువతితో వివాహం జరగనుంది. అమ్మాయిది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని సమాచారం. నరసాపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీల కుమార్తె పుష్పవల్లిని  రాధాకృష్ణ వివాహం చేసుకోబుతున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఈ నెల 19న నర్సాపురంలోనే వంగవీటి రాధా నిశ్చితార్తం జరగనుంది. సెప్టెంబర్ వంగవీటి రాధా వివాహం జరగనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీని వివాహ ముహుర్తంగా నిర్ణయించినట్టుగా వారు తెలిపారు. 

అయితే వంగవీటి రాధా తన పెళ్లి విషయం చెప్పడానికే ఇటీవల తన ప్రధాన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయాలని చూసినట్టుగా తెలిసింది. అయితే ఆ తర్వాత ఈ సమావేశాన్ని రద్దు చేసి.. కొంతమంది ఆత్మీయులకు మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. 

ఇక, వంగవీటి రంగ కుమారుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. వంగవీటి రాధా 2004లో ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పెళ్లికి చేసుకోబోతున్నారనే వార్త వినిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu