ఏపీలో విద్యుత్ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాల పెంపు..

Published : Aug 16, 2023, 11:13 AM IST
ఏపీలో విద్యుత్ శాఖ  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్..  భారీగా జీతాల పెంపు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన వేతనం ఈ నెల 11 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.21 వేల జీతం దాటింది. 

ఈ నిర్ణయంతో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యుత్ శాఖలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, వారికి మెరుగైన వేతనం, బీమా కవరేజీని అందజేస్తుందని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?