
విజయవాడ : తాను పోటీచేసే నియోజకవర్గం పేరే సరిగ్గా పలకడంరాని శుంఠపుత్రుడు లోకేష్ ను చంద్రబాబు ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తున్నాడని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.మంగళగిరికి మందలగిరికి తేడా తెలియని మాలోకం లోకేష్ అంటూ ఎద్దేవా చేసారు. తనకు ఎక్స్ పైర్ డేట్ వచ్చేసిందని తెలిసుకున్న చంద్రబాబు శుంఠపుత్రుడిని ప్రజల్లోకి పంపిస్తున్నాడని మేయర్ అన్నారు.
మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి కూడా పాల్గొని మాజీ మంత్రికి భర్త్ డే విషెస్ తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లోకేష్,పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు.
ఎందకూ పనికిరాని వారాలబ్బాయి పవన్ కల్యాణ్ మనల్సి ఉద్దరిస్తానంటున్నాడని భాగ్యలక్ష్మి ఎద్దేవా చేసారు. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చెప్పకుండా కేవలం ప్రజలకు మంచిచేస్తున్న సీఎం జగన్ ను తిట్టడమే పవన్ పనిగా పెట్టుకున్నాడని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువచేస్తున్న వాలంటీర్లను విమర్శించడం తగదని... వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేయవద్దని పవన్ కు మేయర్ సూచించారు.
Read More ఆ ముగ్గురికే మళ్లీ టికెట్లు ఖాయం... వైసిపి అభ్యర్థులను ప్రకటించిన సజ్జల (వీడియో)
ఎన్నికల సమయం కాంబట్టి పవన్, లోకేష్ ప్రజల్లోకి వచ్చారని... ఈ ఐదేళ్ళు వీరు ఎక్కడున్నారని భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. ఇలాంటివారిని నమ్మితే సర్వనాశనం అయిపోతామని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ ఐదేళ్లు సుపరిపాలన అందించిన వైఎస్ జగనే మరో 30ఏళ్లు ముఖ్యమంత్రిగా వుంటారని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
ఇదిలావుంటే మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా తన పుట్టినరోజున ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు టిడిపి,పవన్ జనసేన, బీజేపీతో పాటు మరికొన్ని తోకపార్టీలన్నీ పొత్తులకోసం ఆరాటపడుతున్నాయని... కానీ రానున్న రోజుల్లో వైసిపి ఫ్యాన్ గాలికి దిక్కుమాలిన పార్టీలన్నీ కృష్ణానదిలో కలిసిపోతాయని అన్నారు. సింగిల్ గా పోటీ చేసే సత్తా వున్న పార్టీ వైసిపి... దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.