వంగవీటి రాధాకు, కొడాలి నానిలకు కరోనా పాజిటివ్.. !

By SumaBala BukkaFirst Published Jan 12, 2022, 8:28 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ విజయవాడ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఆంధ్రప్రదేశ్ : andhrapradeshలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు corona virus బారిన పడడం కలకలం రేపుతోంది. 

తెలుగుదేశం పార్టీ విజయవాడ నేత Vangaveeti Radhaకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి Kodali Naniకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. 

కాగా వీరిద్దరి మధ్య రాజకీయంగా హాట్ హాట్ గా విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తుంటాయి. తాజాగా వంగవీటి రాధా హత్యకు రెక్కీ విసయంలోనూ వీరిద్దరి మధ్య వాగ్భాణాలు నడిచాయి. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధావ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారిన సంగతి తెలిసిందే. 

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో రాధా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాధా ఇంటికెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడంతో చాలా మందిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం  కలిగిదే చంద్రబాబుకే అంటూ వ్యాఖ్యానించారు. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

‘నా సమక్షంలో రాధా అతడిని హత్య చేయడానికి రెక్కీ జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాను. దీంతో ముఖ్యమంత్రి విచారణ చేయాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. రాధా భద్రత కల్పించాలని నన్ను అడగలేదు.. నేనూ కూడా సీఎంను భద్రత కల్పించమని అడగలేదు‌’ అని కొడాలి నాని అన్నారు.

రాధాకు గన్‌మెన్లను తీసుకోవాలని, జాగ్రత్తకు ఉండాలని సూచించినట్టుగా చెప్పారు. భద్రత తీసుకోవాలా..? వద్దా..?, పోలీసులకు సహకరించాలా..? వద్దా..? అన్నది రాధా వ్యక్తిగత విషయం అని అన్నారు. chandrababu naidu రాజకీయ వ్యభిచారి అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విచారణ జరుగుతుందన్న సమయంలో బాధ్యత గల మంత్రిగా తానేమి మాట్లాడలేనని అన్నారు. 

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో జరిగిన వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాధా వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మాట్లాడిన నాని.. వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. అయితే ప్రభుత్వం కల్పించిన గన్‌మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. 

ఇప్పుడు వీరిద్దరూ ఒకేసారి కరోనా కోరల్లో చిక్కుకోవడం వీరి అనుచరులను ఆందోళనలో పడేసింది. 
 

click me!