పోలీస్ స్టేషన్ ఎదుటే చెల్లెలిపై అన్న కత్తితో దాడి.. తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని దారుణం...

By SumaBala BukkaFirst Published Jan 12, 2022, 8:05 AM IST
Highlights

శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు.  దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారి చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. అనుకోని ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీస్ స్టేషన్ ఎదుటే కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. హరీష్ నుంచి ఆమెను రక్షించి.. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

కొవ్వూరు : ప్రేమించిన వాడిని.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. సొంత కుటుంబసభ్యుల్నే శత్రువులుగా మార్చింది.తమకు ఇష్టం లేకుండా love marriage చేసుకుందని పోలీస్ స్టేషన్ ఎదుట చెల్లెలిపై అన్న attack చేసి... knifeతో పొడిచిన ఘటన సోమవారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. బాధితురాలి కథనం మేరకు సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలెంకు చెందిన అశోక్ లు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. 

అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇంట్లో వాళ్లకు తమ ప్రేమ విషయం తెలిసి.. అభ్యంతరం చెప్పారు. దీంతో వాళ్లు తమ పెళ్లికి ఎలాగూ అంగీకరించరనుకున్నారేమో.. ఇద్దరు మేనేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన వారి పెళ్లికి ఇరు familys అభ్యంతరం చెప్పాయి.

దీంతో ఈ విషయం కొవ్వూరు police stationకు చేరింది.  ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రాత్రి కావడంతో అప్పటికి వారిని వెళ్ళిపోయి.. మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. రాత్రికి శిరీషను తమ ఇంటికి తీసుకువెళ్లాలని ఆమె కుటుంబసభ్యులు అనుకున్నారు. 

అయితే, శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు.  దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారి చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. అనుకోని ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీస్ స్టేషన్ ఎదుటే కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. హరీష్ నుంచి ఆమెను రక్షించి.. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఆమెకు పరీక్షించిన డాక్టర్లు శిరీషకు ప్రాణాపాయం లేదని చెప్పారు. హరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ దగ్గర కత్తి ఎక్కడిది? ముందుగానే దాడి ప్లాన్ చేసుకుని వచ్చాడా? కత్తి ఎందుకు తీసుకువచ్చాడు? అనే అనుమానాలు ఇప్పుడు ఇరు కుటుంబసభ్యుల్లో మెదులుతున్నాయి. 

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. guntur  జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.  మాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు  ప్రమాదానికి గురైంది.  స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాచర్ల ఎమ్మెల్యే 
Pinnelli Ramakrishnareddy చిన్నాన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కారులో వెళ్తుండగా దుర్గి మండలం అడిగోప్పల వద్దకు రాగానే అదుపుతప్పి Sagar Canalలోకి దూసుకెళ్లింది. 

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు.కారులో ఉన్న ఆయన భార్య,ఇద్దరు పిల్లలు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారును అధికారులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. కారును వెతికేందుకు పెద్ద క్రేన్ ను తీసుకువచ్చారు.  ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  అధికారులు కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.

click me!