ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు.కారులో ఉన్న ఆయన భార్య,ఇద్దరు పిల్లలు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారును అధికారులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
దుర్గి : guntur జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాచర్ల ఎమ్మెల్యే
Pinnelli Ramakrishnareddy చిన్నాన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కారులో వెళ్తుండగా దుర్గి మండలం అడిగోప్పల వద్దకు రాగానే అదుపుతప్పి Sagar Canalలోకి దూసుకెళ్లింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు.కారులో ఉన్న ఆయన భార్య,ఇద్దరు పిల్లలు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారును అధికారులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. కారును వెతికేందుకు పెద్ద క్రేన్ ను తీసుకువచ్చారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.
ఇలాంటి విషాదకర ఘటనే మంగళవారం క్రిష్ణాజిల్లాలో జరిగింది. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర మున్నేరు వాగులో గల్లంతైన ఐదుగురు చిన్నారుల కథ విషాదాంతం అయ్యింది. వాగులో మునిగి చనిపోయారు. వీరి మృత దేహాలను మంగళవారం వెలికి తీశారు. బాల యేసు (12), అజయ్ (12), గురజాల చరణ్ (14)లతో పాటు మరో చిన్నారి మృతదేమాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీసింది. చిన్నారుల మృతదేహాలను చూసి భోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
కృష్ణాజిల్లా chandarlapadu మండలం ఏలూరు గ్రామం వద్ద munneru surroundingsల్లో ఐదుగురు పిల్లలు సోమవారం missing అయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురి పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
పిల్లల బట్టలు, వారి సైకిళ్ళు ఏటి ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు సైతం పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
తప్పిపోయిన పిల్లలు.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో వీరంతా ఇంటి దగ్గరే ఉన్నారు. సోమవారం ఉదయం వీరు వంటకు పుల్లలు తీసుకొద్దామని సైకిళ్లపై బయలుదేరారు. పిల్లలు మున్నేరు దగ్గరికి వెళ్లినట్లు పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్, చందర్లపాడు ఎస్ ఐ రామకృష్ణ, తహసిల్దార్ సుశీలాదేవి గాలింపు చర్యలు చేపట్టారు.
పల్లెకారులు, గజ ఈతగాళ్లు, గ్రామస్తులు నదిలో పడవల సహాయంతో రాత్రివేళ వెతుకులాట ప్రారంభించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. చివరికి మంగళవారం ఉదయం మృతదేహాలు వెలికి తీశారు.