స్నేహలత హత్య: మానవ హక్కుల కమిషన్ కు అనిత ఫిర్యాదు

Published : Dec 26, 2020, 07:55 AM ISTUpdated : Dec 26, 2020, 07:56 AM IST
స్నేహలత హత్య: మానవ హక్కుల కమిషన్ కు అనిత ఫిర్యాదు

సారాంశం

అనంతపురం జిల్లాలో జరిగిన స్నేహలత హత్యపై తెలుగుదేశం పార్టీ నేత వంగలపూడి అనిత మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్నేహలత అనే యువతిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

అమరావతి: యువతి స్నేహలత హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ లకు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలో స్నేహలత హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్ పర్సన్, జాతీయ మహిళా కమిషన్  ఛైర్ పర్సన్ లకు  తెలుగుదేశం పార్టీ  మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. 

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు, ఆత్యాచారాలు, నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందిని,  మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అనిత విమర్శించారు. 

Also Read: స్నేహలత హత్య ఘటనలో ఇద్దరు అరెస్టు

వైకాపా నేతల నుండి మహిళలకు వేధింపులు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలపై రాష్ట్రంలో  పెద్దఎత్తున నేరాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. 

బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎస్బీఐ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేసే 20 ఏళ్ళ అమ్మాయి స్నేహలతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు.  

Also Read: స్నేహలత హత్య కేసు : జగన్ రెడ్డి నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారింది.. నారా లోకేష్..(వీడియో)

రాజేష్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నారని రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే స్నేహలతను అత్యంత కిరాతకంగా చంపారని అనిత అన్నారు.. స్నేహలత కేసులో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని అన్నారు. స్నేహలత హత్యపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా, నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu