
పార్టీ నుంచి స స్పెండయిన టిడిపి ఎమ్మెల్సీవాకాటి నారాయణ రెడ్డి తొణకడం లేదు. బ్యాంకులకు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి రుణాలు తీసుకోవడం, తర్వాత కట్టకపోవడం తో ఆయన నివాసాల మీద సిబిఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దాన్నలా తుడిచేసి, చిన్న విషయం సర్దుబాటు అయిపోతుందన్నారు.
ముఖ్యమంత్రి తన సస్సెండ్ చేయడాన్ని కూడా స్వాగతించారు. ఆయన ఈ రోజు ప్రతికలవారికి తన సిబిఐ దాడులు, పార్టీ నుంచి సస్పెన్షన్ వగైరాల మీద చెప్పిన విషయాలివి.
నన్ను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా.
నాపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తా.
మళ్లీ టీడీపీతో, చంద్రబాబుతో కలిసి ప్రజా సేవ చేస్తా.
ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు రుణపడి ఉంటా.
బ్యాంకు రుణాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమే.
ఆర్ధిక మాంద్యం వల్లే వ్యాపారపరమైన ఇబ్బందులు వచ్చాయి.
చాలా కాలం కిందటే విదేశీ పెట్టుబడులు మా సంస్ధల్లో ఉన్నాయి.
రుణాలను రీ-స్ట్రక్చర్ చేసే అంశంపై ఆలోచన చేస్తున్నాం.
మరో రెండు, మూడు నెలల్లో అంతా సర్దుకుంటుంది.