ముగిసిన సీపీఎం మహాసభలు.. ఏపీ కొత్త కార్యదర్శిగా వీ. శ్రీనివాసరావు, 50 మందితో రాష్ట్ర కమిటీ

Siva Kodati |  
Published : Dec 29, 2021, 07:47 PM IST
ముగిసిన సీపీఎం మహాసభలు.. ఏపీ కొత్త కార్యదర్శిగా వీ. శ్రీనివాసరావు, 50 మందితో రాష్ట్ర కమిటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శిగా (cpm ap state secretary) వి శ్రీనివాసరావు (v srinivasa rao) ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 50 మంది సభ్యులతో కొత్త కమిటీని పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా వున్న పీ మధుకి (p madhu) ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించారు. 

ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శిగా (cpm ap state secretary) వి శ్రీనివాసరావు (v srinivasa rao) ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 50 మంది సభ్యులతో కొత్త కమిటీని పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా వున్న పీ మధుకి (p madhu) ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఏపీ సీపీఎం కొత్త కమిటీకి కేంద్రం కమిటీ అభినందనలు తెలిపింది. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజుల పాటు జరిగిన సీపీఎం మహాసభలు (cpm mahasabalulu) బుధవారంతో ముగిశాయి. 

మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో వివిధ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి మద్దతు తెలపడంతో పాటు పలు రంగాలపై నేతలు తీర్మానాలు చేశారు. రాజధానిగా అమరావతి ఉండాలంటూ సీపీఎం చేసిన తీర్మానాన్ని అమరావతి రైతులు స్వాగతించారు. ఈ మేరకు మహాసభల వేదిక వద్దకు వచ్చిన రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (sitaram yechury) , ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు (bv raghavulu), ప్రస్తుత కార్యదర్శి పి.మధుతో మంతనాలు జరిపారు.  అమరావతి రైతుల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని సీపీఎం నేతలు మరోసారి స్పష్టంచేశారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?