ఏపీ: కొత్తగా 162 మందికి పాజిటివ్.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Siva Kodati |  
Published : Dec 29, 2021, 06:48 PM IST
ఏపీ: కొత్తగా 162 మందికి పాజిటివ్.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 162 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. నిన్న ఒక్కరోజు 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,049 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 162 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,73,954కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఎవరూ మరణించలేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,492కి చేరుకుంది. 

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,58,413కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,743 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,12,62,099కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1049 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 9, చిత్తూరు 19, తూర్పుగోదావరి 22, గుంటూరు 17, కడప 3, కృష్ణ 15, కర్నూలు 1, నెల్లూరు 11, ప్రకాశం 3, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 17, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 30 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

అటు దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కి చేరింది. నిన్న కరోనాతో 302 మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,80,592కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,42,51,292కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 77,002 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.  దేశంలో నిన్న 64,61,321 డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,15,35,641కు చేరింది. 


 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర యూనివర్సిటీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalya | Asianet News Telugu
Deputy CM Pawan kalyan: ఆంధ్ర యూనివర్సిటీ పవన్ పంచ్ లకి పడిపడి నవ్విన స్టూడెంట్స్ | Asianet Telugu