
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వేడుకలు (new year celebrations) ప్రజలు సిద్ధమవుతున్న వేళ.. విశాఖ నగర పోలీసులు (vizag police) ఆంక్షలు విధించారు. ఈ మేరకు వైజాగ్ సీపీ మనీష్ కుమార్ సిన్హా (manish kumar sinha) మీడియా ముందుకు వచ్చారు. డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి మూసివేస్తున్నామని.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, బీఆర్‌టీఎస్ సహా ఇతర రోడ్లు క్లోజ్ చేస్తున్నామని సీపీ తెలిపారు.
ప్లబ్లిక్ గా బయటకి వచ్చి సెలెబ్రెషన్ లు చేయ్యడం, కేకులు కొయ్యడం లాంటివి నిషేధమన్నారు. 31 డిసెంబర్ అర్ధరాత్రి బైకులపై తిరుగుతూ హడావుడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని మనీష్ కుమార్ హెచ్చరించారు. రెస్టారెంట్ లు , వైన్ షాపు లు వాటి టైమింగ్ ప్రకారం ఓపెన్ గా ఉంటాయని.. ఎక్కడా డీజేలు పెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారే న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని...లేదా పోలీస్ స్టేషన్‌లో మాతో కలిసి న్యూ ఇయర్ చేసుకోవాలంటూ సీపీ సూచించారు.
ALso Read:హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు.. కొత్త సీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన
అటు హైదరాబాద్‌లోనూ పోలీసులు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. దీనిపై కొత్త కమీషనర్ సీవీ ఆనంద్ (cv anand) కీలక ప్రకటన చేశారు. న్యూఇయర్ పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన వున్న స్థానికులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆనంద్ హెచ్చరించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్‌లను విక్రయించవద్దని.. పార్టీల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు.
ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లరాదని ఆనంద్ సూచించారు. రెండు డోసులు వేసుకున్న వారికి మాత్రమే ఈవెంట్లలోకి అనుమతి వుంటుందన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు మూసివేస్తామని సీపీ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు వుంటాయని .. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని సీపీ వెల్లడించారు.