
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని Simhachalam అప్పన్న ఆలయంలో అపచారం చోటు చేసుకొంది. గర్భాలయాన్ని వీడియో తీసిన ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
స్వామి అంతరాలయాన్ని వీడియో తీసి పోస్టు చేయడంపై భక్తులు బండిపడుతున్నారు. గర్భాలయంలోని నిజరూప విగ్రహాన్ని Video తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"
సింహాచలం Appanna ఆలయంలో భద్రత లోపాాలపై Deevotees మండిపడుతున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏ ఉద్దేశ్యంతో స్వామి నిజరూప విగ్రహాన్ని సదరు ఆకతాయి తీశాడో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అధికారుల అలసత్వం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకొందని భక్తులు ఆరోపిస్తున్నారు.