వికేంద్రీకరణ ఓకే.. రాజధాని మార్పు మంచిది కాదు: కిషన్ రెడ్డి

By Siva KodatiFirst Published Feb 2, 2020, 8:58 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జేఏసీ నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Also Read:జనసేనకు గుడ్‌బై: జేడీ లక్ష్మీనారాయణ పయనమెటు?

ఆందోళనకారులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక సమాచారం అందిన తర్వాతే ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతామని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయమైనా, తాము కొన్ని సూచనలు చేస్తామని మంత్రి తెలిపారు. రైతుల గురించి కూడా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతామని కిషన్ తెలిపారు.

Also Read:ఎప్పుడో చెప్పాం: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జీవీఎల్

రాజ్యాంగం పరిధిలోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అయినా.. రాజధాని మార్పు మంచిది కాదన్నారు. బీజేపీ ఏపీ శాఖ మూడు రాజధానులు వద్దని చెప్పిందన్న సంగతిని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

click me!