పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి: చివరకు జరిగింది ఇదీ...

Published : Dec 23, 2020, 07:36 AM IST
పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి: చివరకు జరిగింది ఇదీ...

సారాంశం

చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో అంత్యక్రియలు చేయడానికి తీసుకుని వెళ్తుండగా లేచి కూర్చున్న వ్యక్తి ఉదంతం తెలిసిందే. అతని కథ చివరకు ముగిసింది.

చిత్తూరు: పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి ఉదంతం విషాదకరంగా ముగిసింది. అంత్యక్రియలకు తీసుకుని వెళ్తుండగా ఓ వ్యక్తి పాడెపై లేచి కూర్చున్న విషయం తెలిసిందే. అయితే 24 గంటలు కూడా గడవక ముందే అతను తుదిశ్వాస విడిచాడు. 

చిత్తూరు దజిల్లా మదనపల్లె రూరల్ మండలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దాంతో అతను మరణించాడని భావించి గ్రామస్థులు అంత్యక్రియలకు తీసుకుని వెళ్తుండగా స్పృహలోకి వచ్చాడు. సోమవారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది. 

Also Read: అంత్యక్రియలకు తీసుకెళుతుండగా.. పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి.. !

దాంతో అతన్ని రెవెన్యూ, పంచాయతీ అధికారులు మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారంనాడు మరణించాడు.

అయితే, అతను ఎవరనే విషయం తేలలేదు. అతని వివరాలు తెలియడ లేదు. అతను ఎవరనే విషయాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu