గుంటూరులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ఆఫీస్ కు నిప్పు: ఫర్నీచర్ దగ్దం

By narsimha lodeFirst Published Feb 7, 2023, 9:52 AM IST
Highlights

గుంటూరు నగరంలోని  వైసీపీ నేత బోరుగడ్డ అనిల్  కార్యాలయానికి  గుర్తు తెలియని  వ్యక్తులు  నిప్పు పెట్టారు.  దీంతో  ఈ కార్యాలయంలో  ఫర్నీచర్  పూర్తిగా దగ్దమైంది.  

గుంటూరు:  నగరంలోని  డొంక రోడ్డులో  వైసీపీ  నేత  బోరుగడ్డ అనిల్  కార్యాలయానికి సోమవారం నాడు అర్ధరాత్రి  గుర్తు తెలియని దుండగులు  నిప్పు పెట్టారు. దీంతో  ఈ కార్యాలయంలోని  ఫర్నీచర్  పూర్తిగా దగ్దమైంది.  

ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డికి  బోరుగడ్డ అనిల్ కుమార్  ఫోన్  చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ మధ్య మాటల యుద్ధం చోటు  చేసుకుంది. నెల్లూరు వీధుల్లో  కోటంరెడ్డిని  ఈడ్చుకెళ్తానని  అనిల్   వ్యాఖ్యలు  కలకలం రేపాయి. ఈ ఆడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. అనిల్  వ్యాఖ్యలకు  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే   కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి కూడా  అంతే స్థాయిలో   కౌంటరిచ్చారు.  వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగిన  తరుణంలో గుంటూరులోని   అనిల్  కార్యాలయంలో  ఫర్నీచర్ దగ్దం కావడం కలకం రేపుతుంది.  

అనిల్ కార్యాలయానికి  ఎవరు  నిప్పు పెట్టారనే విషయమై  ప్రస్తుతం  చర్చ సాగుతుంది.   ఉద్దేశ్యపూర్వకంగా ఈ కార్యాలయానికి  ఎవరైనా నిప్పు పెట్టారా  లేదా ప్రమాదవశాత్తు  ఈ కార్యాలయంలో   మంటలు చెలరేగాయా  అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు. 

తన ఫోన్ ట్యాపింగ్  చేస్తున్నారని నెల్లూరు  రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఇటీవల తీవ్ర ఆరోపణలు  చేశారు.  చాలా కాలంగా  తనను వైసీపీ  నాయకత్వం అవామానిస్తుందని  కూడా వ్యాఖ్యలు చేశారు.   టీడీపీలో చేరేందుకు గాను  కోటంరెడ్డ శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు  చేస్తున్నారని  వైసీపీ  నేతలు  చెబుతున్నారు. వైసీపీ  నేతలు,   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతుంది.

also read:ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు బయటకు రావాలి: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్  ఆరోపణలు  చేసిన  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని  కూడా  ప్రభుత్వం  తగ్గించింది.  మరో వైపు   తన వద్ద ఉన్న మరో ఇద్దరు గన్ మెన్లను కూడా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెనక్కి పంపారు. నెల్లూరు రూరల్ అసెంబ్లీకి వైసీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది  వైసీపీ నాయకత్వం.   

click me!