స్ట్రెయిన్ కలకలం: యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు కోవిడ్

By narsimha lode  |  First Published Dec 29, 2020, 4:43 PM IST

యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా స్ట్రెయిన్ వైరస్ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు ప్రకటించింది.
 


రాజమండ్రి: యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా స్ట్రెయిన్ వైరస్ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు ప్రకటించింది.

ఢిల్లీలోని క్వారంటైన్ నుండి తప్పించుకొని ఈ మహిళ రాజమండ్రికి రైలులో వచ్చింది.రాజమండ్రికి యూకే నుండి వచ్చిన మహిళలను గుర్తించిన వైద్యులు ఆమెను పరీక్షించారు.యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు స్ట్రెయిన్ వైరస్ సోకిందని  మంగళవారం నాడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Latest Videos

undefined

also read:స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదు, ముగ్గురికి కరోనా: సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా

ఈ మహిళ ద్వారా ఎవరికీ కూడ స్ట్రెయిన్ వైరస్ సోకలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రకటించారు. ఈ మహిళతో ప్రయాణించిన ఆమె కొడుకు స్ట్రెయిన్ సోకలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవని ఆయన స్పస్టం చేశారు. 

also read:స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదు: తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

ఈ మహిళ ప్రయాణం చేసిన రైల్వే బోగీలు ఎవరెవరు ఉన్నారనే విషయమై కూడ అధికారలుు ఆరా తీశారు. వారికి కూడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదౌతున్నాయి.ఈ తరుణంలో స్ట్రెయిన్ కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. 


 

click me!