కాకినాడలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

Published : Aug 29, 2022, 02:50 PM ISTUpdated : Aug 29, 2022, 03:10 PM IST
కాకినాడలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

సారాంశం

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసకుంది. వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు  మృతిచెందారు. 

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసకుంది. వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు  మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. మృతులను సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌లుగా గుర్తించారు. ఇక, ప్యారీ కంపెనీలో 10 రోజుల వ్యవదిలోనే రెండోసారి ప్రమాదం చోటుచేసుకోవడం కార్మికులను భయాందోళనకు గురించింది. 

ఈ నెల 19వ తేదీన ప్యారీ షుగర్స్ రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. మృతులను ఉప్పాడ కొత్తపల్లికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెట్లపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు (45)గా గుర్తించారు. గాయపడిన వారిని బి.వీర వెంకట రమణ (లోడింగ్ సూపర్‌వైజర్), జాగు వీరబాబు, జి.ఎస్.సుబ్రమణ్యం, మోరుకుర్తి జగన్నాధం, రాయుడు రమణ, వి.సూర్యరెడ్డి, యర్ల నాగేశ్వరరావు, కొల్లుబోయిన అప్పల రాజు, రాయుడు గిరీష్ కుమార్‌లుగా గుర్తించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!