ఏపీలో వినాయక చవితికి సీఎం జగన్ పర్మిషన్ కావాలి: సోము వీర్రాజు ఫైర్

By Sumanth KanukulaFirst Published Aug 29, 2022, 2:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితికి సీఎం జగన్ పర్మిషన్ కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. గతంలో కోవిడ్ ఉందని వినాయక చవితి ఉత్సవాలకు నిబంధనలు పెట్టారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితికి సీఎం జగన్ పర్మిషన్ కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. సోము వీర్రాజు అధ్యక్షతన సోమవారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం వినాయక ఉత్సవాలకు ఆంక్షలు విధించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. గతంలో కోవిడ్ ఉందని వినాయక చవితి ఉత్సవాలకు నిబంధనలు పెట్టారని అన్నారు. అప్పట్లో కోవిడ్ నిబంధనలన్నీ హిందూ పండగలకు మాత్రమే నిబంధనలు అడ్డొస్తాయని విమర్శించారు.

తెలుగు దినోత్సవం జీవో కూడా ఇంగ్లీష్‌లో ఉందని విమర్శించారు. సీఎం జగన్‌కు ఇంగ్లీష్‌పై అంత ప్రేమ ఎందుకంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌కు 5 కి.మీ రోడ్డు వేసే దమ్ములేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రతిపక్షం చేయలేని ఉద్యమాలు తాము చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

పోలవరం విషయంలో కేంద్రం తప్పు లేదని సోమువీర్రాజు అన్నారు. అంచనాలు పెరగడానికి గతంలో ఉన్న ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. మద్యం మాఫియాలో ఎవరిపాత్ర ఏమిటో తమకు తెలుసని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజును అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిశారు. వారు చేపట్టనున్న మహా పాదయాత్రకు ఆహ్వానం అందించారు.  అమరావతి విషయంలో బీజేపీ పాత్ర, కేంద్రం ద్వారా నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 
 

click me!