విజయనగరం జిల్లాలో దారుణం...పోలీసునంటూ బెదిరించి ఇద్దరు యువతులపై అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Jan 02, 2022, 08:58 AM ISTUpdated : Jan 02, 2022, 09:18 AM IST
విజయనగరం జిల్లాలో దారుణం...పోలీసునంటూ బెదిరించి ఇద్దరు యువతులపై అత్యాచారం

సారాంశం

విజయనగరం జిల్లా కురపాం నియోజకవర్గ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. న్యూఇయర్ వేడుక జరుపుకుని ఇంటికి వెళుతున్న ఇద్దరు విద్యార్థిణులపై ఓ నకిలీ పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

విజయనగరం: పోలీసునంటూ బెదిరించి ఇద్దరు యువతులపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన విజయనగరం జిల్లా (vijayanagaram district)లో చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకలు (new year celebrations) జరుపుకుని ఇంటికి వెళుతుండగా యువతులపై ఈ అఘాయిత్యం జరిగింది.  

వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా కురపాం (kurapam) నియోజకవర్గ పరిధిలోని జియ్యమ్మవలస (jiyammavalasa) మండలానికి చెందిన ఇద్దరు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ఇంటికి తిరిగివెళుతుండగా రావాడ  డ్యాం (ravada dam) వద్ద ఒకడు అడ్డుకున్నాడు. యువతుల వాహనాన్ని అడ్డుకున్న అతడు పోలీసునంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు యువతులిద్దరూ బెంబేలెత్తిపోయారు. 

తాను చెప్పినట్లు వినకుంటే అరెస్ట్ చేస్తానని బెదిరించిన దుండగుడు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వారిని విడిచిపెట్టాడు.  

read more  Kurnool Crime: వివాహేతర సంబంధానికి ఒకరు బలి... వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి

అయితే ఇంటికి చేరుకున్న యువతులు తమపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల నుండి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.  

యువతులు తెలిపిన వివరాలప్రకారం రావాడ డ్యాం వద్దకు చేరుకుని పరిశీలించారు పోలీసులు. వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు చివరకు యువతులను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నకిలీ పోలీస్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరాన్ని అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా ప్రజలు పోలీసులను కోరుతున్నారు.  

read more  కుమార్తెపై అత్యాచారం.. గర్భందాల్చడంతో అబార్షన్.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష...

ఇదిలావుంటే ఖమ్మం జిల్లా అశ్వాపురంలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. పదమూడేళ్ల బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్న బాలిక ఒంటరిగా వుండగా పక్కింట్లో వుండే సాంబశివరావు (26) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

 ఒంటరిగా ఉన్న బాలికను ఆ యువకుడు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పనికి వెళ్లి వచ్చిన అమ్మమ్మకు బాధిత చిన్నారి విషయం చెప్పింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు నిందితుని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వాపురం పోలీసులు తెలిపారు.

 నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తాగిన మైకంలో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.ఇలా తండ్రి చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురయిన బాలిక గర్భం దాల్చింది. అయితే ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యురాలి సహాయంతో ఏడు నెలల పిండం తొలగించాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో 2014 జులై 9న మోర్తాడ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

దీంతో పోక్సో చట్లం కింద కేసులు నమోదు చేశారు. గర్భస్రావానికి సహకరించిన వైద్యురాలి పేరునూ కేసులో చేర్చారు. ఇలా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్