CM JAGAN సింహం.. ఆయ‌నను ఎదుర్కోవడం సాధ్యం కాదు .. AP Deputy CM ధర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Rajesh KFirst Published Jan 2, 2022, 1:10 AM IST
Highlights

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జగన్ సింహం వంటి వాడని, ఆయ‌ను ఢీ కొట్ట‌డానికి.. ఎన్ని జంతువులు కలిసినా..  ఏమీ చేయలేవని అన్నారు. అలాగే, ఎన్ని పార్టీలు కలిసినా సీఎం జగన్ కు ఏమీకాదని పేర్కొన్నారు.  తాము అమరావతి రాజధానిని మార్చడంలేదని, వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని ధర్మాన పేర్కొన్నారు.
 

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న పరిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు.   సీఎం జ‌గ‌న్ ను సింహంతో పోల్చాడు. ఆ సింహాన్ని ఎదుర్కోవడం కోసం ఎన్ని జంతువులు కలిసినా సింహాన్ని ఏమీ చేయలేవని అన్నారు. మరో రెండేళ్లలో జ‌ర‌గ‌బోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసినా సీఎం జగన్ కు ఏమీకాదని, రాబోయే ఎన్నికల కోసం .. ప్ర‌తిప‌క్ష‌ పార్టీలన్నీ ఇప్పటి నుండే.. ఏకమవుతున్నాయంటూ ధర్మాన కృష్ణదాస్ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . 

 రాష్ట్ర రాజ‌ధాని అమరావతి పై దుష్ప్ర‌చారం చేస్తూ.. ప్ర‌తిప‌క్షాలు రాజకీయ లబ్ది పొందాలని  ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ రాజధాని అయితే..  ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే శ్రీకాకుళం చాలా వెనకబడింది ఉంద‌నీ,  ప‌రిపాల‌న‌ వికేంద్రీకరణ జ‌రిగితేనే.. అభివృద్ధి జ‌రుగుతోంద‌ని అన్నారు. 

Latest Videos

READ ALSO: పెన్షన్ పెంపు.. ఇదేనా మాట తప్పను, మడమ తిప్పనంటే: జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శలు
 
ప‌రిపాల‌న వికేంద్రీకరణ చేయ‌డం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్య‌మ‌ని , ఆ లక్ష్యంతోనే  సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్ప‌ష్టం చేశారు. అస‌లు అమరావతి ని మార్చడం లేదని,  శాసన రాజధానిగా అమరావతి ఉంటుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడం కోసం  జ‌గ‌న్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ధర్మాన కృష్ణదాస్ చెప్పారు .  

అభివృద్ది ఒకే ప్రాంతంలో అభివృద్ధి చెందటం కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందితేనే  స‌మ‌గ్ర అభివృద్ది జ‌రిగిన‌ట్టు అని ఆయన పేర్కొన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ మళ్లీ కలిసి పోటీ చేస్తాయని సంకేతాలు వస్తున్నాయని ,ఎంతమంది వచ్చినా వైసిపిని ఏం చేయలేవు అని ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలు మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి కే పట్టం కడతారని ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తేల్చి చెప్పారు.

READ ALSO: దేశాభివృద్ధిని కరోనా అడ్డుకోలేదు.. సువర్ణాధ్యాయం లిఖించండి: ప్రధాని మోడీ న్యూ ఇయర్ మెసేజ్

అలాగే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని  తమ్మినేని సీతారాం మండిపడ్డారు. చంద్ర‌బాబు వ‌ల్ల  టీడీపీ మీద‌నే కాదు ..రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయిందని తమ్మినేని అన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు చాలా వ్యత్యాసం ఉందని,  అధికారంలోకి వ‌స్తే.. వన్టైమ్ సెటిల్మెంట్ ఫ్రీగా చేస్తామని, పేదలకు గృహాలపై హక్కులను ఉచితంగా కల్పిస్తామని చెబుతున్న చంద్రబాబు, అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో చెప్పాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిలదీశారు.  రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ పై  అప‌రాప నమ్మకంతో ఉన్నాద‌నీ,  మరో రెండు మూడు సార్లు జగనే సీఎం అవుతారంటూ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

click me!