Kurnool Crime:వివాహేతర సంబంధానికి ఒకరు బలి... వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి

Arun Kumar P   | Asianet News
Published : Jan 02, 2022, 07:57 AM ISTUpdated : Jan 02, 2022, 08:09 AM IST
Kurnool Crime:వివాహేతర సంబంధానికి ఒకరు బలి... వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి

సారాంశం

క్షణికానందం కోసం సాగించే వివాహేతర సంబంధాలు ఎప్పటికయినా ముప్పేనని మరో ఘటన రుజువుచేసింది. వివాహితతో సంబంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి అతి కిరాతకంగా హత్యకు గురయిన దుర్ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

కర్నూల్: వివాహేతర సంబంధాని (extra marital affair) కి మరో నిండు ప్రాణం బలయ్యింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి హతమార్చిన ఘటన ఐదు రోజులక్రితం కర్నూల్ జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో హత్యకు గల కారణం బయటపడింది.  

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ జిల్లా (kurnool district) ఎమ్మిగనూరు మండలం మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర(42) తాగుడుకు బానిస. నిత్యం మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులతో గొడవ పడేవాడు. కొద్దిరోజుల క్రితం కూడా ఇలాగే కుటుంబంతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.  

ఆవేశంగా ఇంట్లోంచి బయటివచ్చిన అతడు తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో కౌతాళం మండలం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని అక్కడే జీవించసాగాడు. అదే గ్రామంలో వ్యవసాయ పనులకు వెళుతున్న సమయంలో ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఇదికాస్తా అక్రమసంబంధానికి దారితీసింది. 

read more   వివాహేతర సంబంధం : భార్య కాపురానికి రాలేదని విషద్రావణం తాగిన భర్త.. ట్విస్ట్ ఏంటంటే...

అయితే ఇటీవల వీరి అక్రమ బంధం గురించి వివాహిత భార్య హనుమంతురెడ్డికి తెలిసింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన అతడు రాఘవేంద్రను ప్రాణాలు తీయడానికి సిద్దమయ్యాడు. ఇందుకోసం గ్రామానికి చెందిన మూకయ్య సహకారం తీసుకున్నాడు.

ప్లాన్ ప్రకారం వీరిద్దరు రాత్రి నిద్రలో వుండగా రాఘవేంద్రను వేటకొడవలితో నరికి చంపేసారు. అరవకుండా ఒకరు రాఘవేంద్ర నోటిని మూసివుంచగా మరొకరు వేటకత్తితో నరికి చంపారు. ఇలా హన్మంతురెడ్డి, మూకయ్య సైలెంట్ గా రాఘవేంద్రను అతి దారుణంగా చంపేసారు. ఆ తర్వాత తమకేమీ తెలియదన్నట్లుగా వుండిపోయారు. 

రాఘవేంద్ర రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడివుండటాన్ని గుర్తించినవారు గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్వాడ్ తో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీస్ కుక్కలు హనుమంతు ఇంటిచుట్టూ తిరగడంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. 

తన భార్యతో రాఘవేంద్ర అక్రమసంబంధాన్ని కొనసాగించడంతోనే హతమార్చినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ హత్యలో అతడికి సహకరించిన మూకయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

read more  వివాహేతర సంబంధం : అతనికి 21, ఆమెకు 35.. కలిసి బతకలేమని.. అడవిలోకి వెళ్లి ఉరేసుకుని..

ఇదిలావుంటే ప్రియుడితో ఓ మహిళ సాగిస్తున్న అక్రమసంబంధం గురించి తెలిసి ఇద్దరు వ్యక్తులు బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రియుడి ఎదుటే ఆమెపై దారుణానికి పాల్పడ్డారు దుర్మార్గులు. దీంతో అవమానం భరించలేక బాధితురాలు, ఆమె ప్రియుడు వికారాబాద్ సమీపంలో విషం తాగి suicideకు యత్నించారు.

విషం తాగిన ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా సమాచారం అందుకున్న బాధితుడి సోదరుడు వెంటనే అక్కడకు వచ్చి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంది కోలుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు  ఇస్మాయిల్ తో పాటు అతడికి సహకరించి బాలుడిని అరెస్ట్ చేసారు. 
 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం