
చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన మినీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుడుపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.