డబ్బులు వసూలు చేసేందుకు కిడ్నాప్, హత్య: భీమవరం రొయ్యల వ్యాపారిని చంపిన ముఠా అరెస్ట్

By narsimha lodeFirst Published Feb 25, 2021, 10:25 AM IST
Highlights

 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండరామారావు హత్య కేసును పోలీసులు చేధించారు. 

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండరామారావు హత్య కేసును పోలీసులు చేధించారు. 

ఈ నెల 11వ తేదీన ఆయన ఆచూకీ లేకుండాపోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కానీ ఇంతలోనే తెలంగాణలోని భద్రద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట వద్ద జీడి మామిడి తోట రామారావు మృతదేహాన్ని గుర్తించారు.

కోదండరామారావు ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన గుండా వీరాస్వామికి రామారావుకు రూ. 2 కోట్లు బకాయి ఉన్నాడు. ఈ డబ్బులు రాబట్టేందుకు కిడ్నాప్ చేశారు.

ఈ క్రమంలో డబ్బుల కోసం కోదండరామారావును కొట్టడంతో ఆయన మరణించాడు. దీంతో మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట వద్ద జీడి మామిడితోట వదిలి వెళ్లారు.

రామారావును కిడ్నాప్, హత్య కేసులో వీరాస్వామికి సహకరించిన కేతా సూర్యచైతన్య, అప్పలబత్తుల కృష్ణవంశీ, బుర్రా మణికంఠలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో సంబంధాలున్న నాంచారయ్య, భరత్ వెంకట సుధీర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
 

click me!