ప.గోదావరిజిల్లా మోళ్లపర్రులో విషాదం: విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

Published : Jul 06, 2023, 10:53 AM ISTUpdated : Jul 06, 2023, 11:58 AM IST
 ప.గోదావరిజిల్లా మోళ్లపర్రులో విషాదం:  విద్యుత్ షాక్ తో  ఇద్దరు మృతి

సారాంశం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం మోళ్లపర్రులో విద్యుత్ షాక్ తో  ఇద్దరు మృతి చెందారు.  


ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం  మోళ్లపర్రులో  విద్యుత్ షాక్ తో  గురువారంనాడు  ఇద్దరు మృతి చెందారు. మృతులను  నారాయణమూర్తి, వెంకటేశ్వర్లుగా గుర్తించారు.  గ్రామంలోని చేపల వేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు  చేసుకుంది. చెరువుకు  ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కు  విద్యుత్  ప్రవహించి  ఈ ఇద్దరు విద్యుత్ షాక్ కు గురైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.

గతంలో కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  విద్యుత్ షాక్ తో  పలువురు మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి.  హైద్రాబాద్  బంజారాహిల్స్ లోని ఓ స్కూల్ లో ఇంటర్ విద్యార్ధికి  విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ధిని  పేరేంట్స్ ఆసుపత్రిలో  చేర్పించారు. ఈ ఘటన  ఈ ఏడాది  జూన్ మాసంలో  చోటు  చేసుకుంది. గాయపడిన విద్యార్ధిని హసన్ గా గుర్తించారు. 

ఈ ఏడాది జూన్  6వ తేదీన  హైద్రాబాద్ కేపీహెచ్‌బీ అడ్డగుట్ట రోడ్డులో విద్యుత్ షాక్ తో  బాపనమ్మ అనే మహిళ  మృతి  చెందింది.  ఇంటి ముందు  ఉన్న చెట్టు  వద్ద ఆడుకుంటున్న  ఐదేళ్ల చిన్నారికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ విషయం గుర్తించిన  బాపనమ్మ బాలికను  రక్షించింది. ఈ క్రమంలో  ఆమె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది.  ఇంటి ముందున్న  చెట్టుకు కేబుల్ టీవీ కేబుల్స్ కట్టారు. పక్కనే విద్యుత్ స్థంబం కూడ ఉంది.  దీంతో  విద్యుత్ షాక్ కొట్టిందని స్థానికులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu