గౌతం సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవిలో ట్విస్ట్, ఈ ఇబ్బందులొస్తే .. జగన్ సర్కార్ తర్జన భర్జనలు..?

By Siva KodatiFirst Published Feb 17, 2022, 8:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా సవాంగ్‌ను నియమిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పదవి విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎస్ హోదాలో వుండగా.. రాజ్యాంగబద్ధ పదవి చేపట్టొచ్చా అనే అంశంపై ప్రభుత్వం, గౌతం సవాంగ్ తర్జన భర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ డీజీపీ (dgp) గా వున్న గౌతం సవాంగ్‌ను (gautam sawang) ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ సర్కార్. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా సవాంగ్‌ను నియమిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పదవి విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎస్ హోదాలో వుండగా.. రాజ్యాంగబద్ధ పదవి చేపట్టొచ్చా అనే అంశంపై ప్రభుత్వం, గౌతం సవాంగ్ తర్జన భర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాతే గౌతం సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిని చేపడతారంటూ చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి స్వీకరిస్తే.. డీమ్డ్ టూ హేవ్ రిజైన్డ్ అంటూ మరో వాదన జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందుల్లేకుండా గౌతం సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిని ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. గతంలో కనగరాజ్ తరహా పరిస్ధితులు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతోంది. 

కాగా.. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ సర్కార్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గౌతమ్ సవాంగ్‌కు ఎటువంటి పోస్టింగ్ కేటాయించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే తాజాగా ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది.

ఇక, 1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్‌ వైఎస్ జగన్ ప్రభుత్వం (ys jagan) ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు ఇంకా సర్వీసు ఉండగా ఆకస్మత్తుగా బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్.. ఆయనను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇకపోతే .. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (kasireddy rajendranath reddy) .. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.  ఆయన గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగా కూడా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో  రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు.

click me!