బద్వేలు విజయం చరిత్రాత్మకం.. సంక్షేమం, అభివృద్ధికి పట్టం కట్టారు.. డిప్యూటీ సీఎం అంజాద్ భాష (వీడియో)

By AN TeluguFirst Published Nov 2, 2021, 3:09 PM IST
Highlights

ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు, బురద చల్లే ప్రయత్నాలు చేశాయని, చేస్తున్నాయని.. ఈ విజయం ప్రతిపక్ష పార్టీల చెంప చళ్ళు మనేలా తీర్పు చెప్పాయని అన్నారు. బీజేపీ కి వచ్చిన ఓట్లు నేరుగా వచ్చినవి కాదు. బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వచ్చిన ఓట్లు అన్నారు. 

వైఎస్సార్ జిల్లా : బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి సుధ గెలుపు పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ...బద్వేలు విజయం చరిత్రాత్మకం అని.. అలాంటి విజయాన్ని ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ కు అందజేశారన్నారు. 

"

వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిని ఆశీర్వధించిన Badvelu ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కి ప్రజలు పట్టం కట్టారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కి ఓట్లు వేశారన్నారు.

ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు, బురద చల్లే ప్రయత్నాలు చేశాయని, చేస్తున్నాయని.. ఈ విజయం ప్రతిపక్ష పార్టీల చెంప చళ్ళు మనేలా తీర్పు చెప్పాయని అన్నారు. బీజేపీ కి వచ్చిన ఓట్లు నేరుగా వచ్చినవి కాదు. బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వచ్చిన ఓట్లు అన్నారు. 

TDP అభ్యర్థిని ప్రకటించినా తిరుపతి ఎన్నికల్లో పునరావృతం అవుతుందని ఆఖరి నిమిషంలో పోటీ నుండి తప్పుకున్నారు. janasena పోటీ చేయమని అంటూనే బీజేపీ కి మద్దతు ఇచ్చారు.  మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇద్దరు చంద్రబాబు మనుషులు కారా...? అని Amjad Basha అన్నారు.

వీరు బీజేపీ లోకి ఎందుకు వెళ్లారో తెలియదా.. బీజేపీ తరపున టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఏజెంట్ లుగా కూర్చున్న పరిస్థితి అన్నారు. 

రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పట్టం కట్టారు. 90 వేల పై చిలుకు భారీ మెజారిటీతో గెలుపొందడం హర్షణీయం అన్నారు.

ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అనవసర ఆరోపణలు మానేసి ప్రజా సమస్యల పై పోరాటం చేయాలన్నారు. ఉప ఎన్నిక తీర్పు ప్రతిపక్ష పార్టీలలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

‘సచ్చిపోయిన పార్టీ మాకేం డెడ్ లైన్లు పెడతది.. వెళ్లి మోడీకి పెట్టమనండి’.. పవన్ పై కొడాలి నాని ఫైర్... (వీడియో)

ఇదిలా ఉండగా.. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సీఎం జగన్ నాయకత్వానికి, వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.  

బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయం సాధించిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమం పాలన వల్ల తాము గడప గడపకు వెళ్లి ఓట్లు అడిగగాలమని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలను కోరారు.  ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. బీజేపీ వెనకాల నుంచి మొత్తం నడిపించిందని ఆరోపించారు. 

click me!