గుంటూరు: కోర్టులో 12 మందికి కరోనా.. బాధితుల్లో న్యాయమూర్తులు

By Siva Kodati  |  First Published Apr 21, 2021, 2:53 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీ హైకోర్టులో కోవిడ్ బారినపడి పలువురు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు కోర్టులో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది


గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీ హైకోర్టులో కోవిడ్ బారినపడి పలువురు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు కోర్టులో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

మొత్తం 12 మందికి వైరస్‌ సోకింది. వీరిలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులున్నారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ కోర్టు అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తున్న రవి బుధవారం ఉదయం మృతి చెందారు. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్ కౌన్సిల్‌‌ సభ్యులు, న్యాయశాఖ సిబ్బంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దీంతో జిల్లా కోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది.  

Latest Videos

Also Read:కరోనా కల్లోలం: కోవిడ్ తో ఏపీహైకోర్టులో ఇద్దరు ఉద్యోగుల మృతి

కాగా, ఏపీ హైకోర్టులో  టైపిస్ట్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యం , జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలతలు కరోనాతో మరణించారు. కరోనాతో ఇద్దరు ఉద్యోగులు మరణించడంతో కోర్టు ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ లోనే  కేసుల విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్నందున  ఈ నెల 20వ తేదీ నుండి  ఈ నెల 30 వ తేదీ వరకు విజయవాడ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని  మూసివేయాలని  నిర్ణయం తీసుకొన్నారు
 

click me!