టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలి: జగన్ కు సోము వీర్రాజు లేఖ

By narsimha lodeFirst Published Apr 21, 2021, 12:54 PM IST
Highlights

కరోనా కేసుల నేపథ్యంలో  రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ కి  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం నాడు లేఖ రాశాడు.  

అమరావతి: కరోనా కేసుల నేపథ్యంలో  రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ కి  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం నాడు లేఖ రాశాడు.  రాష్ట్రంలో కరోనా కేసులు  రోజు రోజుకి పెరిగిపోతున్నాయని  ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించడం వల్ల కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స విధానాలు, ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

also read:ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు: జగన్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

ప్రైవేట్ ఆసుపత్రులు, కరోనా రోగులను దోచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తామని  ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. సీబీఎస్ఈ, తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ  టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేిసన విషయాన్ని ఏపీకి చెందిన  విపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. 
 

click me!